IPL 2024 : ఐపీఎల్ 2024కు ముందు గుజ‌రాత్ టైటాన్స్‌కు భారీ షాక్‌.. ‘జార్ఖండ్ క్రిస్ గేల్‌’కు యాక్సిడెంట్..

ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు ముందు గుజ‌రాత్ టైటాన్స్ కు భారీ షాక్ త‌గిలింది.

IPL 2024 : ఐపీఎల్ 2024కు ముందు గుజ‌రాత్ టైటాన్స్‌కు భారీ షాక్‌.. ‘జార్ఖండ్ క్రిస్ గేల్‌’కు యాక్సిడెంట్..

Robin Minz

IPL : ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు ముందు గుజ‌రాత్ టైటాన్స్ కు భారీ షాక్ త‌గిలింది. మినీ వేలంలో రూ.3.6 కోట్లు వెచ్చించి మ‌రీ సొంతం చేసుకున్న యువ ఆట‌గాడు రాబిన్ మింజ్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డాడు. ఆదివారం మింజ్ క‌వాస‌కీ సూప‌ర్ బైక్ పై వెలుతుండ‌గా మ‌రో బైక్‌ ఢీ కొట్టింది. అయితే.. ఈ ప్ర‌మాదంలో అత‌డికి స్వ‌ల్ప గాయాలు అయిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం అత‌డు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మింజ్.. ధోని వార‌సుడిగా, జార్ఖండ్ క్రిస్‌గేల్ గా పేరుపొందాడు. మ‌రో బైక్ ఢీ కొట్ట‌డంతో రాబిన్ త‌న బైక్ పై నియంత్ర‌ణ కోల్పోయాడని, దీంతో అత‌డికి చిన్న‌పాటి గాయాలు అయిన‌ట్లు అత‌డి తండ్రి ఫ్రాన్సిన్ మింజ్ తెలిపాడు. ప్ర‌స్తుతం అత‌డు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించాడు. ఈ విష‌యం తెలుసుకున్న గుజ‌రాత్ టైటాన్స్ అభిమానులు షాక్‌కు గురైయ్యారు. ఐపీఎల్ ఆరంభానికి మ‌రో రెండు వారాలు స‌మ‌యం ఉండ‌డంతో ఆ లోపు రాబిన్ కోలుకోవాల‌ని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

SRH : సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు కొత్త కెప్టెన్..!

రాబిన్ మింజ్ కుడి మోకాలికి గాయాలైనట్లు సమాచారం. అతని సూపర్‌బైక్ ముందు భాగం కూడా ధ్వంసమైందని తెలుస్తోంది. రాబిన్ టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు ధోనికి వీరాభిమాని. రాబిన్ ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా త‌న రాష్ట్రం త‌రుపున రంజీల్లో అరంగ్రేటం చేయ‌లేదు. అండ‌ర్-19, అండ‌ర్‌-25 లో జార్ఖండ్ జట్టు త‌రుపున ఆడాడు. అత‌డు ఐపీఎల్ కోసం త్వ‌ర‌లోనే గుజ‌రాత్ టైటాన్స్ శిక్షణా శిబిరంలో చేరాల్సి ఉంది. ఇప్పుడు అత‌డు గాయ‌ప‌డ‌డంతో ఐపీఎల్‌లో పాల్గొంటాడా? లేదా? అన్న‌ది ప్ర‌స్తుతానికి ఖ‌చ్చితంగా తెలియ‌దు.

అంబానీ ఇంట్లో ప్రీవెడ్డింగ్ వేడుకలో జహీర్ ఖాన్‌ను ఆట‌ప‌ట్టించిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్