IPL : ట్రేడ్ డీల్ కంప్లీట్‌.. రిష‌బ్ పంత్ జీతంలో 12 కోట్లు కోత‌.. కుల్దీప్ యాద‌వ్ పై సానుభూతి

IPL : ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జట్ల మ‌ధ్య ట్రేడ్ డీల్ పూర్తి అయింది.

Trade Deal Complete Rishabh Pant and Kuldeep Yadav switch their franchises

  • ఢిల్లీ, ల‌క్నో జ‌ట్ల మ‌ధ్య ట్రేడ్ డీల్ పూర్తి
  • పంత్ ఢిల్లీకి, కుల్దీప్ ల‌క్నోకి
  • కొత్త డీల్‌లో భారీ మొత్తంలో జీతాన్ని వ‌దులుకున్న పంత్

IPL : అనుకున్న‌ట్లుగానే జరిగింది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రిష‌బ్ పంత్‌ను వ‌దులుకుంది. అత‌డి స్థానంలో ట్రేడింగ్ ద్వారా కుల్దీప్ యాద‌వ్‌ను ల‌క్నో త‌మ జ‌ట్టులోకి చేర్చుకుంది. మ‌రోవైపు రిష‌బ్ పంత్ త‌న పాత జ‌ట్టు అయిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ వెళ్లాడు. ఈ విష‌యాన్ని ఐపీఎల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

ఢిల్లీ, ల‌క్నో జ‌ట్లు ట్రేడ్ డీల్ ద్వారా ప‌ర‌స్ప‌రం ఆట‌గాళ్ల‌ను మార్పిడి చేసుకున్నాయి. కుల్దీప్ యాద‌వ్‌ను తీసుకుని పంత్ ను ఢిల్లీకి ల‌క్నో జ‌ట్టు ఇచ్చిన‌ట్లు తెలిపింది. ఇక కుల్దీప్ యాద‌వ్ తాను ప్ర‌స్తుత అందుకుంటున్న 13.5 కోట్ల రూపాయ‌ల‌తోనే ల‌క్నో జ‌ట్టులో చేరాడు. ఐపీఎల్ 2027 సీజ‌న్‌లోనూ అత‌డు అదే మొత్తాన్ని ల‌క్నో నుంచి అందుకోనున్నాడు.

*IND vs ENG : భార‌త్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్ జ‌ట్టు ఇదే.. జేమ్స్ కోల్స్‌కు తొలి పిలుపు..

మ‌రోవైపు ఐపీఎల్‌లో అత్య‌ధిక ధ‌ర క‌లిగిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్ కొత్త డీల్‌లో భాగంగా జీతంలో భారీ కోత‌కు అంగీక‌రించాడు. ల‌క్నో త‌రుపున 27 కోట్లు అందుకున్న పంత్.. ఢిల్లీకి కేవ‌లం 15 కోట్ల‌కే వెళ్లాడు. ఐపీఎల్ 2027 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పంత్‌కు 15 కోట్ల‌నే చెల్లించ‌నుంది. అంటే పంత్ 12 కోట్ల న‌ష్టంతో ఢిల్లీకి వెళ్లాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిష‌బ్ పంత్‌ను ల‌క్నో 27 కోట్ల‌కు సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

2016 నుండి 2024 మధ్య తొమ్మిది సీజన్ల పాటు రిష‌బ్ పంత్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌రుపున‌నే ఆడాడు. ఆ స‌మ‌యంలో ఢిల్లీ త‌రుపున అత్య‌ధిక మ్యాచ్‌లు (111) ఆడిన రికార్డుల‌కు ఎక్కాడు. ఇక 2021 నుంచి 2024 మ‌ధ్య నాలుగు సీజ‌న్ల పాటు ఢిల్లీకి 43 మ్యాచ్‌ల్లో నాయ‌క‌త్వం వ‌హించాడు.

*Alireza Beiranvand : గొర్రెల కాపరి నుంచి ప్రపంచకప్ హీరోగా.. ఇరాన్ గోల్ కీప‌ర్ అలిరెజా అద్భుత గాథ

ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఐదు సీజన్ల పాటు అత్యంత విజయవంతమైన ప్రస్థానం తర్వాత కుల్దీప్.. ల‌క్నోకు వెళ్లాడు. 2022లో ఢిల్లీలో చేరిన కుల్దీప్ 65 మ్యాచ్‌ల్లో 72 వికెట్లు తీశాడు.

కుల్దీప్ యాద‌వ్ పై సానుభూతి..

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కుల్దీప్ యాద‌వ్ పై నెటిజ‌న్లు సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నారు. లక్నో త‌రుపున మ్యాచ్‌లో ఆశించిన ప్ర‌ద‌ర్శ‌న లేకుంటే తిట్లు త‌ప్ప‌వ‌ని కామెంట్లు పెడుతున్నారు.