IND vs ENG : భారత్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు ఇదే.. జేమ్స్ కోల్స్కు తొలి పిలుపు..
భారత్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (IND vs ENG) తమ జట్టును ప్రకటించింది.
England Squad For T20I Series vs India Harry Brook led Squad
- జూలై 1 నుంచి భారత్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్
- జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్
- హ్యారీ బ్రూక్ సారథ్యంలో బరిలోకి.. 17 మందికి చోటు
IND vs ENG : ఈ నెలాఖరులో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో తొలుత 5 టీ20లు, ఆ తరువాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లను ఆడనుంది. ఇప్పటికే బీసీసీఐ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే టీ20, వన్డే జట్లను ప్రకటించింది. ఇక తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భారత్‌తో టీ20 సిరీస్ కోసం 17 మందితో కూడిన జట్టును ప్రకటించాడు. ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్కు తొలిసారి ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు ఎంపిక అయ్యాడు. హ్యారీ బ్రూక్ సారథ్యంలో ఇంగ్లాండ్ బరిలోకి దిగనుంది.
‘గత 12 నెలల్లో ఇంగ్లాండ్ లయన్స్‌తో పాటు దేశీయ, విదేశీ టీ20 టోర్నమెంట్లలో జేమ్స్ కోల్స్ అద్భుత ప్రదర్శనలు చేశాడు. అందుకే అతను ఈ అవకాశాన్ని సంపాదించుకున్నాడు. న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే భారత్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానుండటంతో జట్టు ఎంపికలో కొంత వెసులుబాటు కోసం పెద్ద స్క్వాడ్‌ను ఎంపిక చేశాం.’ అని సెలెక్టర్ మార్కస్ నార్త్ తెలిపాడు.
*Alireza Beiranvand : గొర్రెల కాపరి నుంచి ప్రపంచకప్ హీరోగా.. ఇరాన్ గోల్ కీపర్ అలిరెజా అద్భుత గాథ
Our 17-player squad is IN! 💪
Excitement building ahead of our five-match IT20 series with India!
Click below for the full story:
— England Cricket (@englandcricket) June 22, 2026
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 1న చెస్టర్-లీ-స్ట్రీట్‌లో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. టెలివిజన్ వీక్షకుల సంఖ్య పెంచే ఉద్దేశంతో ఈ సిరీస్‌లోని మ్యాచ్‌ల ప్రారంభ సమయాలను ఈసీబీ ఓ గంట ముందుకు జరిపింది. దీంతో తొలి, మూడో, నాలుగో టీ20 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభం అవుతాయి. రెండు, ఐదో టీ20 మ్యాచ్‌లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.
భారత్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు ఇదే..
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రేహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్ (వికెట్ కీపర్), సామ్ కరన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.
భారత్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టీ20 మ్యాచ్ – జూలై 1న ( చెస్టర్-లీ-స్ట్రీట్)
* రెండో టీ20 మ్యాచ్ – జూలై 4న (మాంచెస్టర్)
* మూడో టీ20 మ్యాచ్ – జూలై 7న (నాటింగ్‌హామ్)
* నాలుగో టీ20 మ్యాచ్ – జూలై 9న (బ్రిస్టల్)
* ఐదో టీ20 మ్యాచ్ – జూలై 11న (సౌతాంప్టన్)
