టీమిండియా క్రికేటర్లు ధర్మశాలలో అడుగు పెట్టారు. దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. వెస్టిండీస్ టెస్టు సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసి..ఫుల్ హుషారుతో ఉంది జట్టు. సెప్టంబర్ 13వ తేదీ శుక్రవారం అడుగపెట్టిన భారత క్రీడాకారులకు ఘన స్వాగతం లభించింది. ఈ టోర్నీలో రబాడా ఆడుతున్నాడు. ఇండియాకు రావడం పట్ల సంతోషంగా ఉందని వెల్లడించాడు. ట్విట్టర్ వేదికగా ఆయన తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇండియాలో మళ్లీ అడుగు పెట్టి క్రికెట్ ఆడడం చాలా ఆనందంగా ఉందన్నాడు.
సెప్టెంబర్ 09న ధర్మశాలకు సఫారీ ఆటగాళ్లు చేరుకున్నారు. విరామం దొరకడంంతో మెక్లోడ్ గంజ్ ప్రాంతంలో షాపింగ్ చేశారు. కొందరు హెయిర్ కట్ చేసుకున్నారు. అక్కడున్న వస్తువులను కొనుగోలు చేశారు. టిబెటియన్ డంప్‌లింగ్స్ వంటి సంప్రదాయ ఆహార పదార్థాలను తిన్నారు. భారత్ – దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం రాత్రి తొలి టీ 20 మ్యాచ్ జరుగనుంది. మొత్తం మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ని టీమిండియా ఆడనుంది.
టీమిండియా చేతులో ఒక్కసారి కూడా టీ 20ల్లో సౌతాఫ్రికా ఓడిపోలేదు. అదే రికార్డును కొనసాగించాలని ఉత్సుహకతో ఉంది. సొంతగడ్డపై టీ 20 గెలిచి తీరాలని కోహ్లీ సేన టీం ఉవ్విళ్లూరుతోంది. దీంతో టీ 20 సిరీస్ ఆసక్తికరంగా మారింది.
మూడు టెస్ట్ ల సిరీస్ కోసం సెప్టెంబర్ 12వ తేదీన జట్టును ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ శర్మకు దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు అవకాశం ఇచ్చింది. వరుసగా విఫలవుతున్న కేఎల్ రాహుల్‌కి మాత్రం టెస్ట్ టీమ్ లో ఈసారి చోటు దక్కలేదు. జట్టును ప్రకటించిన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మకు ఓపెనర్‌గా అవకాశం ఇస్తున్నట్టు వెల్లడించారు.
Read More : టెస్ట్ సిరీస్ కు భారత జట్టు ఇదే: ఆంధ్రలోనే ఫస్ట్ మ్యాచ్.. రాహుల్ అవుట్
భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్.
సెప్టెంబర్ 15 : తొలి టీ 20 ధర్మశాల
సెప్టెంబర్ 18 : రెండో టీ 20 మొహాలి
సెప్టెంబర్ 22 : మూడో టీ 20 బెంగళూరు
అక్టోబర్ 2 -6 తొలి టెస్టు విశాఖపట్టణం
అక్టోబర్ 10 – 14 రెండో టెస్టు ఫుణె
అక్టోబర్ 19 – 23 మూడో టెస్టు రాంచి
A traditional welcome for #TeamIndia as they arrive in Dharamsala ahead of the 1st T20I against South Africa.#INDvSA pic.twitter.com/oUSxwUQ6ag
— BCCI (@BCCI) September 13, 2019