UAE vs New Zealand : న్యూజిలాండ్ జట్టుకు షాకిచ్చిన యూఏఈ.. ఏడు వికెట్ల తేడాతో కివీస్‌ను మట్టికరిపించిన పసికూన జట్టు

143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ బ్యాటర్ ఆర్యన్ష్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తరువాత బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

UAE vs New Zealand T20 Match

UAE vs New Zealand 2nd T20: టీ20ల్లో పసికూన జట్టు యూఏఈ సంచలనం సృష్టించింది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి న్యూజిలాండ్ జట్టును మట్టికరిపించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని యూఏఈ కేవలం 15.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో అంతర్జాతీయ మ్యాచ్‌లో తొలిసారిగా న్యూజిలాండ్ జట్టుపై యూఏఈ విజయంసాధించింది. అలవోకగా కివీస్‌పై విజయం సాధించి పసికూన జట్టు ఆటగాళ్లు తమ సత్తాను చాటుకున్నారు.

UAE vs New Zealand 2nd T20 Match

న్యూజిలాండ్ వర్సెస్ యూఏఈ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. శనివారం (ఆగస్టు 19) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్ లో కివీస్ జట్టుకు యూఏఈ గట్టి షాకిచ్చింది. యూఏఈ తరపున కెప్టెన్ ముహమ్మద్ వసీం కేవలం 29 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 55 పరుగులు చేశాడు. ఆసీఫ్ ఖాన్ ఐదు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 48 నాటౌట్‌గా నిలిచాడు. బౌలింగ్ విభాగంలోనూ యూఏఈ బౌలర్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. యూఏఈ తరపున లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్ అయాన్ అఫ్జల్ మూడు వికెట్లు, జవదుల్లా రెండు వికెట్లు పడగొట్టారు.

UAE vs New Zealand 2nd T20 Match

టాస్ ఓడిన న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. వరుసగా వికెట్లు కోల్పోవటంతో.. ఒకానొక దశలో 65 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కనీసం 100 పరుగులైనా న్యూజిలాండ్ జట్టు చేరుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే చివరిలో మార్క్ చాప్‌మన్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో ఎనిమిది వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు 142 పరుగులు చేసింది. చాప్‌మన్ 46 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 63 పరుగులు చేశాడు.

UAE vs New Zealand 2nd T20 Match

143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ బ్యాటర్ ఆర్యన్ష్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తరువాత బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీం (29 బంతుల్లో 55 పరుగులు), వృత్యా అరవింద్ (25 పరుగులు), బాసిల్ హమీద్ (12 నాటౌట్), ఆసిఫ్ ఖాన్ (29 బంతుల్లో 48నాటౌట్) పరుగులు చేసి యూఏఈ విజయంలో కీలక భూమిక పోషించారు. న్యూజిలాండ్ జట్టు తమ సీనియర్ ఆటగాళ్లు లేకుండానే యూఏఈతో టీ20 సిరీస్ ఆడుతుంది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన విలియమ్సన్ సిరీస్ నుంచి దూరమయ్యాడు. డెవాన్ కాన్వే, ఫిన్న్ అలెన్, డారిల్ మిచెల్, ఇష్ సోధి వంటి ప్లేయర్స్ ఫ్రాంచైజీ క్రికెట్ లో బిజీగా ఉన్నారు. యూఏఈ, న్యూజిలాండ్ టీ20 సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ ఆదివారం రాత్రి జరుగుతుంది

ట్రెండింగ్ వార్తలు