Unbelievable Scenes: అంపైర్ నాటౌట్ ప్రకటించినా.. పెవిలియన్‌కు వెళ్లి..

భారత మహిళల తొలి డే అండ్ నైట్ టెస్టులో ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగి రికార్డు సృష్టించగా.. మరో ఇండియన్ బ్యాట్స్ ఉమెన్ మరో ఘనత దక్కించుకుంది.

Poonam Raut

Unbelievable Scenes: భారత మహిళల తొలి డే అండ్ నైట్ టెస్టులో ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగి రికార్డు సృష్టించగా.. మరో ఇండియన్ బ్యాట్స్ ఉమెన్ మరో ఘనత దక్కించుకుంది. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ నిలబెడుతూ.. అంపైర్ అవుట్ అని ప్రకటించకపోయినా పెవిలియన్ కు వెళ్లిపోయింది. శుక్రవారం ఇండియా.. ఆస్ట్రేలియాల మధ్య జరిగిన పింక్ టెస్టు రెండో రోజు ఈ ఘటన నమోదైంది.

36పరుగులు స్కోరు చేసిన తర్వాత క్యాచ్ ఇచ్చి అవుట్ అయినట్లు తప్పుకుంది. క్యాచ్ అందుకోవడంతో ఆస్ట్రేలియా ప్లేయర్లు అప్పీల్ చేశారు. దానికి అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు. కానీ, ఇండియన్ బ్యాట్స్ఉమన్ స్వచ్ఛందంగా తాను అవుట్ అని ఫీల్ అయి క్రీజు వదిలి వెళ్లిపోయింది. ఈ సోషల్ వర్త్ టెక్నాలజీస్ ఘటన మొత్తాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసి కాంప్లిమెంట్స్ ఇచ్చింది.

నమ్మశక్యం కాని ఘటనలు అంటూ కామెంట్ పెట్టి అంపైర్ నాటౌట్ ప్రకటించినా.. పూనమ్ రౌత్.. నెం.3 నడుచుకుంటూ వెళ్లిపోయింది అని రాసుకొచ్చాడు. స్టైలిష్ ఓపెనర్ మంధాన రికార్డు నమోదు చేసిన తర్వాత ఇది జరగడం భారత మహిళా క్రికెట్ కు ఆదరణ పెంచింది.

………………………………………….: వార్నర్ ఇన్‌స్టా పోస్టు.. హోటల్ గదికే పరిమితం.. ఎందుకలా

చివరిసారిగా 2006లో ఇరు జట్లు టెస్టులో తలపడగా… 15 ఏళ్ల తర్వాత ఫేస్ టూ ఫేస్ టెస్టుకు సిద్ధమయ్యాయి. మిథాలీ రాజ్, వెటరన్‌ సీమర్‌ జులన్‌ గోస్వామి అప్పటి మ్యాచ్‌ ఆడారు. ఈ మ్యాచ్‌ భారత్‌కు ఈ ఏడాది రెండో టెస్టు.