Rahul Dravid
Rahul Dravid: లంక పర్యటనకు టీమిండియా హెడ్ కోచ్ గా వ్యవహరించనున్న రాహుల్ ద్రవిడ్ యువ క్రికెటర్లకు అవకాశంపై స్పందించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ టీ20కు యువ క్రికెటర్లందరికీ అవకాశమిస్తారనుకోవడం అవాస్తవమని అన్నారు.
కోచ్ గా ఈ సిరీస్ ద్రవిడ్ కెరీర్ లో మలుపుగా మారిపోనుంది. బెంగళూరుకు చెందిన రాహుల్ ద్రవిడ్.. నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు.
‘ఈ మూడు గేమ్‌లలో.. యువ క్రికెటర్లందరికీ అవకాశం వస్తుందనుకోవడం అవాస్తవం. ముగ్గురు వన్ డే ప్లేయర్లలో ఒక్కొక్కరికీ అవకాశం కల్పిస్తాం. అదే సమయంలో సెలక్టర్లు అక్కడే ఉంటారు’ అని పర్యటనకు ముందు ద్రవిడ్ అన్నారు.
ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ అవుతున్న ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ లలో ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపై ప్రశ్నలు మొదలయ్యాయి. శ్రీలంకతో జరిగే వన్డేల కంటే టీ20లకే ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తుంది.
రాబోయే వరల్డ్ కప్ ఈవెంట్ సందర్భంగా.. ఏ ప్లేసుల్లో సెట్ అవుతారనేది తెలుస్తుంది. అంతిమ లక్ష్యమేంటంటే ప్రతి ఒక్కరూ జట్టులో భాగం అవ్వాలనే. సిరీస్ గెలవాలనేదే ప్లాన్’ అని ఈ టీమిండియా మాజీ కెప్టెన్ అంటున్నారు.
వరల్డ్ కప్ ముందు ఉన్న మూడు గేమ్ లు ఇవే కావడంతో సెలక్టర్లు, మేనేజ్మెంట్ ప్రదర్శనను బట్టే వరల్డ్ కప్ ఈవెంట్ కు ఎంపిక చేస్తుంది.