US Open 2023: నోవాక్ జొకోవిచ్‌కు 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్

యూఎస్ ఓపెన్ 2023 ఫైనల్ పోటీల్లో నోవాక్ జొకోవిచ్‌ విజయం సాధించి 24 వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నారు. డేనియల్ మెద్వెదేవ్‌తో జరిగిన ఫైనల్‌లో నోవాక్ జొకోవిచ్ ఆడారు. నోవాక్ జకోవిచ్ 6-3, 7-6 (7-5), 6-3తో డానియల్ మెద్వెదేవ్‌పై విజయం సాధించారు....

  • Updated on- September 11, 2023 / 06:04 AM IST

Novak Djokovic

US Open 2023: యూఎస్ ఓపెన్ 2023 ఫైనల్ పోటీల్లో నోవాక్ జొకోవిచ్‌ విజయం సాధించి 24 వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నారు. డేనియల్ మెద్వెదేవ్‌తో జరిగిన ఫైనల్‌లో నోవాక్ జొకోవిచ్ ఆడారు. నోవాక్ జకోవిచ్ 6-3, 7-6 (7-5), 6-3తో డానియల్ మెద్వెదేవ్‌పై విజయం సాధించారు. (US Open 2023) జకోవిచ్ తన 24వ గ్రాండ్ స్లామ్ ఫైనల్‌ను 36 మ్యాచ్‌ల్లో గెలుచుకున్నారు.

Maharashtra : థానే హైరైజ్ భవనంలో కూలిన లిఫ్ట్…ఏడుగురి మృతి

సెర్బియా లెజెండ్ జొకోవిచ్ తన 36వ కెరీర్ ఫైనల్‌లో తన 24వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ( Novak Djokovic wins 24th Grand Slam title) 2021 యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ లో నోవాక్ జొకోవిచ్ ను మెద్వెదేవ్ ఓడించి విజయం సాధించారు. (beating Daniil Medvedev) దీంతో ఈ సారి మెద్వెదేవ్ పై నోవాక్ జొకోవిచ్ విజయం సాధించి గత ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు.

Chandrababu : ఖైదీ నెంబర్ 7691.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు, స్నేహ బ్లాక్ లో ప్రత్యేక గది సిద్ధం

రష్యా ఆటగాడైన మెద్వెదేవ్ ఓడిపోగా స్టార్ ఆటగాడు నోవాక్ జొకోవిచ్ అనూహ్య విజయం సాధించారు. గ్రాండ్ స్లామ్ ను కైవసం చేసుకున్న జొకోవిచ్ మైదానంలో కలయతిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. అనంతరం టెన్నిస్ కోర్టులోనే కింద కూర్చొని తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు.