Maharashtra : థానే హైరైజ్ భవనంలో కూలిన లిఫ్ట్…ఏడుగురి మృతి

మహారాష్ట్రలో లిఫ్ట్ కూలిన దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. థానే నగరంలో నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్ కూలిపోవడంతో కనీసం ఏడుగురు కార్మికులు మరణించారు. కార్మికులు టెర్రస్‌పై నుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్‌ ఒక్కసారిగా కిందకు పడిపోయింది....

Maharashtra : థానే హైరైజ్ భవనంలో కూలిన లిఫ్ట్…ఏడుగురి మృతి

lift collapses

Updated On : September 11, 2023 / 5:55 AM IST

Maharashtra : మహారాష్ట్రలో లిఫ్ట్ కూలిన దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. థానే నగరంలో నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్ కూలిపోవడంతో కనీసం ఏడుగురు కార్మికులు మరణించారు. కార్మికులు టెర్రస్‌పై నుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్‌ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. భవనం టెర్రస్‌పై వాటర్‌ఫ్రూఫింగ్ పనులు ముగించుకుని 40 అంతస్తుల నిర్మాణం నుంచి కార్మికులు దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. (lift collapses in high-rise)

Chandrababu : ఖైదీ నెంబర్ 7691.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు, స్నేహ బ్లాక్ లో ప్రత్యేక గది సిద్ధం

నిర్మాణ లిఫ్ట్‌లోని సపోర్టింగ్ కేబుల్స్‌లో ఒకటి పగిలిందని,దీనివల్ల ఈ ఘటన జరిగిందని థానే (Thane) డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్‌ అధిసతి యాసిన్ తాడ్వి తెలిపారు. ఇది నిర్మాణ లిఫ్ట్ అని, ఇది సాధారణ ఎలివేటర్ కాదని పోలీసులు చెప్పారు. ప్రత్యక్ష సాక్షులు వెంటనే స్థానిక అగ్నిమాపక శాఖ, పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ప్రస్తుతం లిఫ్ట్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.