Vijay Hazare Trophy
Vijay Hazare Trophy : టీమిండియా యువ బ్యాటర్ రింకూ సింగ్ మైదానంలో రచ్చరచ్చ చేశాడు. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో మెరుపు సెంచరీ చేశాడు. తద్వారా టీమిండియా సెలక్టర్ల నమ్మకాన్ని రింకూ రింగ్ నిజం చేస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ -2026 టోర్నమెంట్ కు తన ఎంపిక సరైందేనని నిరూపిస్తున్నాడు.
Also Read : ఇలా వచ్చి, అలా వెళ్లిపోయాడు.. రోహిత్ శర్మ గోల్డెన్ డక్ వీడియో వైరల్.. చూడండి
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రింకూ సింగ్ ఉత్తరప్రదేశ్ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ టోర్నీలో యూపీ తన తొలి మ్యాచ్ హైదరాబాద్ జట్టుతో ఆడింది. ఈ మ్యాచ్ లో 48 బంతుల్లో 67 పరుగులు చేసిన రింకూ సింగ్.. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో (చండీగఢ్ తో మ్యాచ్) అదరగొట్టాడు. ఐదో స్థానంలో బరిలోకి దిగిన కెప్టెన్ రింకూ సింగ్ క్రీజులోకి వచ్చిన దగ్గర నుంచి విధ్వంసకర బ్యాటింగ్ తో చండీగఢ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో మెరుపువేగంతో శతకం పూర్తి చేశాడు.
🚨 RINKU SINGH SMASHED HUNDRED FROM JUST 56 BALLS IN VHT 🚨
– Rinku is proving the selectors right for the T20I World Cup selection. 🇮🇳 pic.twitter.com/0YMUGgiiZM
— Johns. (@CricCrazyJohns) December 26, 2025
గ్రూప్-బిలో భాగంగా శుక్రవారం చండీగడ్, ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన చంఢీగడ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో యూపీ కెప్టెన్ రింకూ సింగ్ కేవలం 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 60 బంతుల్లో 106 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతని శతక ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి.
– 67(48) in first match.
– 106*(60) in second match.CAPTAIN RINKU SINGH SHOW IN VIJAY HAZARE TROPHY – Great news for Indian Cricket in the T20I World Cup. 👑🤞 pic.twitter.com/Lj8gGHtmTN
— Johns. (@CricCrazyJohns) December 26, 2025
ఇదే ఇన్నింగ్స్ లో అర్యన్ జుయల్ (134), ధ్రువ్ జురెల్ (67) రాణించడంతో.. యూపీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి 367 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చంఢీగడ్ జట్టు 29.3 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో యూపీ జట్టు 227 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.