×
Ad

Vaibhav Sooryavanshi : చ‌రిత్ర సృష్టించిన వైభ‌వ్ సూర్య‌వంశీ.. అండ‌ర్-19 సిక్స‌ర్ల కింగ్‌..

అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓ ఎడిష‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాడిగా వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi) చ‌రిత్ర సృష్టించాడు.

Vaibhav Sooryavanshi creates history Most sixes in U19 World Cup single edition

Vaibhav Sooryavanshi : టీమ్ఇండియా న‌యా సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓ ఎడిష‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా హ‌రారే వేదిక‌గా ఇంగ్లాండ్‌తో ఫైన‌ల్ మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 15వ ఓవ‌ర్ తొలి బంతికి ఫర్హాన్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్స్ బాది వైభ‌వ్ అండ‌ర్19 ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. గ‌తంలో ఈ రికార్డు ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు డెవాల్డ్ బ్రెవిస్ పేరిట ఉండేది. అత‌డు 2022 అండ‌ర్-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో 18 సిక్స‌ర్లు బాదాడు.

T20 World Cup 2026 : మ‌రో రోజులో ప్రారంభం కానున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్‌..

ఇక ఈ మ్యాచ్‌లో వైభ‌వ్ మొత్తంగా 80 బంతులు ఎదుర్కొన్నాడు 15 ఫోర్లు, 15 సిక్స‌ర్ల సాయంతో 175 ప‌రుగులు చేశాడు.

అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ ఓ ఎడిష‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్లు వీరే..

* వైభవ్ సూర్యవంశీ – 2026లో 30 సిక్స‌ర్లు
* డెవాల్డ్ బ్రెవిస్ – 2022లో 18 సిక్స‌ర్లు
* ఫిల్ అలెన్ -2016లో 18 సిక్స‌ర్లు
* జాక్ బర్న్‌హామ్ – 2016లో 15 సిక్స‌ర్లు
* మైఖేల్ హిల్ – 2008లో 14 సిక్స‌ర్లు
* నికోలస్ పూరన్ – 2014లో 14 సిక్స‌ర్లు

WPL 2026 : ‘నాదేం లేదు.. ఈ గెలుపు క్రెడిట్ ఆ ఇద్ద‌రిదే.. అప్పుడు చెప్పా.. మ‌ళ్లీ ఇప్పుడు చెబుతున్నా..’ ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన కామెంట్స్‌..

అంతేకాదండోయ్ అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓ మ్యాచ్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్‌గానూ వైభ‌వ్ రికార్డుల‌కు ఎక్కాడు. ఈ మ్యాచ్‌లో అత‌డు 15 సిక్స‌ర్లు బాదాడు.

అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్లు వీరే..

వైభవ్ సూర్యవంశీ (భార‌త్‌) – 2026లో ఇంగ్లాండ్ పై 15 సిక్స‌ర్లు
మైఖేల్ హిల్ (ఆస్ట్రేలియా) – 2008లో న‌మీబియా పై 12 సిక్స‌ర్లు
క్రెయిగ్ సిమ్మన్స్ (ఆస్ట్రేలియా) – 2002లో కెన్యాపై 11 సిక్స‌ర్లు