Holkar Stadium
IND vs AUS Test Match: బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఇండియాలో జరుగుతుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ పూర్తయింది. ఆసీస్ జట్టు భారీ పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్లు అశ్విన్, జడేజా బౌలింగ్ ధాటికి ఆసీస్ బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేక పెవిలియన్ బాట పట్టారు. రెండో మ్యాచ్ ఈనెల 17 నుంచి ఢిల్లీ వేదికగా ప్రారంభమవుతుంది. మూడో టెస్ట్ మ్యాచ్ తొలుత ధర్మశాలలో నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. మూడో మ్యాచ్ వేదికను మార్చుతూ బీసీసీఐ తాజాగా ట్వీట్ చేసింది.
IND vs AUS 1st Test Match: టీమిండియా స్పిన్ ధాటికి చిత్తైన ఆసీస్.. తొలి టెస్టులో భారత్ ఘన విజయం
నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ మార్చి 1 నుంచి ధర్మశాలలో ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆ వేదికను మార్చుతూ బీసీసీఐ నిర్ణయించింది. ధర్మశాలలో ఔట్‌ఫీల్డ్ సిద్ధంగా లేకపోవటం వల్లనే వేదికను మార్పుచేయాల్సి వచ్చిందని బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ క్యురేటర్ తపోష్ ఛటర్జీ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్‌పీసీఏ) స్టేడియం పిచ్, ఔట్ ఫీల్డ్‌ను తనిఖీ చేసి బోర్డుకు నివేదిక అందించాడు. దీంతో మూడో టెస్టు మ్యాచ్‌ను ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంకు మార్పు చేస్తూ బీసీసీఐ సోమవారం ఉదయం ట్వీట్ చేసింది.
NEWS – Venue for third Test of the @mastercardindia Australia tour of India for Border-Gavaskar Trophy shifted to Indore from Dharamsala. #INDvAUS
More details here – https://t.co/qyx2H6N4vT pic.twitter.com/N3W00ukvYJ
— BCCI (@BCCI) February 13, 2023
Rohit Sharma: రోహిత్‌కు కోపమొచ్చింది.. కెమెరామెన్‌పై సీరియస్.. వీడియో వైరల్
మూడో టెస్టు మ్యాచ్ వేదికను తొలుత ధర్మశాల నుంచి విశాఖపట్టణం, బెంగళూరులలో ఏదో ఒక స్టేడియంకు మార్పు చేయాలని భావించారు. అయితే, మ్యాచ్‌కు తక్కువ సమయం ఉండటంతో ఇబ్బంది ఎదురవ్వకుండా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంకు మార్పుచేశారు. ఈ స్టేడియం చాలా చిన్నదిగా ఉంటుంది.
మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా ..
Border-Gavaskar Trophy IND vs AUS Test Series schedule