Commonwealth Games 2026 : మా వ‌ల్ల కాదు బాబోయ్‌.. చేతులెత్తేసిన ఆస్ట్రేలియా.. సందిగ్థంలో కామన్‌వెల్త్ గేమ్స్ 2026

కామ‌న్‌వెల్త్ గేమ్స్ ను ప్ర‌తి నాలుగు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి నిర్వ‌హిస్తారు. ఒలింపిక్స్ తర్వాత అంతటి స్థాయి కలిగింది కామన్‌వెల్త్ గేమ్స్.ఈ ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీని త‌మ దేశంలోనే నిర్వ‌హించాల‌ని చాలా దేశాలు కోరుకుంటాయి. అయితే అవ‌కాశం మాత్రం కొంద‌రికే ద‌క్కుతుంది.

Commonwealth Games 2026

Commonwealth Games : కామ‌న్‌వెల్త్ గేమ్స్ ను ప్ర‌తి నాలుగు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి నిర్వ‌హిస్తారు. ఒలింపిక్స్ తర్వాత అంతటి స్థాయి కలిగింది కామన్‌వెల్త్ గేమ్స్(Commonwealth Games ). కాగా.. ఈ ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీని త‌మ దేశంలోనే నిర్వ‌హించాల‌ని చాలా దేశాలు కోరుకుంటాయి. అయితే అవ‌కాశం మాత్రం కొంద‌రికే ద‌క్కుతుంది. 2026లో కామ‌న్‌వెల్త్ గేమ్స్ కు ఆస్ట్రేలియా(Australia) ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. విక్టోరియా(Victoria) రాష్ట్రంలో నిర్వ‌హించాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నారు.

అయితే.. కామ‌న్‌వెల్త్ గేమ్స్‌ను నిర్వ‌హించ‌లేమంటూ విక్టోరియా రాష్ట్రం చేతులెత్తేసింది. ఈ గేమ్స్‌ను నిర్వ‌హించేందుకు కావాల్సిన బ‌డ్జెట్ త‌మ వ‌ద్ద లేద‌ని చెప్పింది. తాము అనుకున్న దాని కంటే ఎక్కువ బ‌డ్జెట్ ఈ గేమ్స్ కోసం కావాల‌ని, అస‌లే ఆర్థిక క‌ష్టాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న త‌మకు వీటిని నిర్వ‌హించ‌డం త‌ల‌కు మించిన భారం అవుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో గేమ్స్ నిర్వ‌హ‌ణ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు కామ‌న్ వెల్త్ గేమ్స్ అథారిటీకి స‌మాచారం ఇచ్చింది. అంతేకాదు.. త‌మ కాంట్రాక్ట్‌ను ర‌ద్దు చేయాల‌ని, వేరే వాళ్ల‌కు ఇమ్మ‌ని కోరింది. దీంతో ఈ గేమ్స్ నిర్వ‌హ‌ణపై సందిగ్ధం నెల‌కొంది.

Satwiksairaj Rankireddy : బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి సంచ‌ల‌నం.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్‌

విక్టోరియా స్టేట్ ప్రీమియర్ (ప్రతినిధి) డానియెల్ ఆండ్రూస్ (Daniel Andrews)సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కామ‌న్‌వెల్త్ గేమ్స్ నిర్వ‌హ‌ణ‌కు తాము 2 ఆస్ట్రేలియా బిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా వేశాం. అయితే.. ప్ర‌స్తుతం అది ఏడు ఆస్ట్రేలియన్ బిలియ‌న్ డాల‌ర్లు అయ్యేలా ఉంది. లోటు బ‌డ్జెట్‌తో ఉన్న మాకు ఈ టోర్నీని నిర్వ‌హించ‌డం త‌ల‌కు మించిన భారంగా మారే అవ‌కాశం ఉండ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వివ‌రించారు. విక్టోరియాలో కామ‌న్ వెల్త్ గేమ్స్‌ను నిర్వ‌హిస్తే ఇక్క‌డి టూరిజం, క్రీడా వ‌స‌తుల అభివృద్ధి జ‌రుగుతుంద‌ని, కొత్త ఉద్యోగాలు వ‌స్తాయ‌ని ఆశించిన‌ట్లు చెప్పుకొచ్చారు.

Jasprit Bumrah : వ‌స్తున్నా.. వ‌చ్చేస్తున్నా.. అంటున్న బుమ్రా.. వీడియో వైర‌ల్‌

ఇంగ్లాండ్‌లోని బ‌ర్మింగ్ హ‌మ్ 2022 కామ‌న్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఆ గేమ్స్‌లో 179 ప‌త‌కాల‌తో ఆస్ట్రేలియా అగ్ర‌స్థానం సొంతం చేసుకోగా 176 ప‌త‌కాల‌తో అతిథ్య ఇంగ్లాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఇక భార‌త్ 61 ప‌త‌కాల‌తో నాలుగో ప్లేస్ ద‌క్కించుకుంది.

ట్రెండింగ్ వార్తలు