IPL 2026 : ఐపీఎల్ 2026కు ముందు గుజరాత్ కీలక నిర్ణయం.. కొత్త అసిస్టెంట్ కోచ్‌గా విజయ్ దహియా
ఐపీఎల్ 2026 సీజన్‌కు (IPL 2026 ) ముందు గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : March 12, 2026 / 03:59 PM IST
Vijay Dahiya joins Gujarat Titans as new assistant coach Ahead of IPL 2026
- ఐపీఎల్ 2026కి ముందు గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం
- అసిస్టెంట్ కోచ్‌గా విజయ్ దహియా నియామకం
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ విజయ్ దహియాను అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
భారత క్రికెట్‌లో విజయ్ దహియా సుపరిచితుడు. అతడు అంతర్జాతీయ కెరీర్‌లో రెండు టెస్టులు, 19 వన్డేల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా ఆకట్టుకోకున్నప్పటికి కూడా దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరుపున అద్భుమైన ప్రదర్శనలు చేశాడు. ఆటకు రిటైర్‌మెంట్ ప్రకటించిన తరువాత కోచ్‌గా మారాడు.
BAN vs PAK : బంగ్లాదేశ్ చేతిలో ఓటమి.. పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ కీలక వ్యాఖ్యలు..
అతడి కోచింగ్‌లో ఢిల్లీ జట్టు 2007-08 రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. 2012, 2014లో కేకేఆర్ ఐపీఎల్ విజేతగా నిలిచినప్పుడు ఆ మేనేజ్‌మెంట్ బృందంలో అసిస్టెంట్ కోచ్‌గా దహియా ఉన్నాడు. 2022 నుంచి లక్నో జట్టులో సహాయక సిబ్బంది బృందంలో పని చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ఆ జట్టు నుంచి బయటకు వచ్చాడు.
గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రా ఉన్నాడు. అతడికి డిప్యూటీగా విజయ్ దహియా పని చేయనున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
గుజరాత్ టైటాన్స్ 2022లో ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసింది. తొలి సీజన్‌లోనే టైటిల్‌ను ముద్దాడింది. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకు మరోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోలేదు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. అయితే.. ముంబై చేతిలో ఓడిపోయి ప్లేఆఫ్స్ నుంచే నిష్ర్కమించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 విజేతగా నిలిచి రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకోవాలని గుజరాత్ భావిస్తోంది. ఈక్రమంలోనే సహయక బృందాన్ని పటిష్టం చేసుకుంటోంది.
LSG : ఐపీఎల్ 2026 ముందు కీలక పరిణామం.. అమ్మకానికి లక్నో సూపర్ జెయింట్స్..!
ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ మార్చి 31న న్యూ చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది.
