Vinesh Phogat : వినేశ్ ఫోగ‌ట్ ప‌ట్టు అదిరింది.. ప‌త‌కానికి అడుగు దూరంలో..

భార‌త మ‌హిళా రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్ పారిస్ ఒలింపిక్స్‌లో దుమ్ములేపుతోంది.

Vinesh Phogat enter into Semifinals Paris Olympics 2024

Paris Olympics – Vinesh Phogat : భార‌త మ‌హిళా రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్ పారిస్ ఒలింపిక్స్‌లో దుమ్ములేపుతోంది. 50 కేజీల ఈవెంట్‌లో సెమీస్‌కు చేరుకుంది. క్వార్ట‌ర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన లివ‌చ్ ఒక్సానాపై 7-5 తేడాతో విజ‌యం సాధించింది. ఆఖ‌రి నిమిషంలో ఫోగ‌ట్ పై లివ‌చ్ ఒత్తిడి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించ‌గా వినేష్ త‌న క్లాస్‌తో స‌త్తా చాటింది.

ఇక అంత‌క ముందు ప్రిక్వార్ట‌ర్స్‌లో నాలుగు సార్లు ప్ర‌పంచ ఛాంపియ‌న్‌, స్వ‌ర్ణ ప‌త‌క విజేత అయిన జ‌పాన్ కు చెందిన సుసాకి కి వినేష్ ఫోగ‌ట్ షాకిచ్చింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన 50 కేజీల విభాగంలో ప్రిక్వార్ట‌ర్ లో ట్యోకో స్వ‌ర్ణ ప‌త‌క విజేత అయిన సుసాకీని 3-2 తేడాతో ఓడించింది.

Neeraj Chopra : పారిస్ ఒలింపిక్స్‌లో అద‌ర‌గొట్టిన నీర‌జ్ చోప్రా.. ప‌త‌కానికి అడుగు దూరంలో

ఓ ద‌శ‌లో వినేష్ 0-2 తేడాతో వెనుక‌బ‌డి ఉంది. అయితే.. 15 సెక‌న్ల‌లో వినేష్ అద్భుతం చేసింది. జ‌పాన్ రెజ్ల‌ర్ పై ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించి 3-2 తేడాతో విజ‌యాన్ని సాధించి స‌గ‌ర్వంగా క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. క్వార్ట‌ర్స్ లో ఆమె ఉక్రెయిన్‌కు చెందిన 8వ సీడ్ ఒక్సానా లివాచ్ ఓడించి సెమీస్‌కు చేరుకుంది. వినేష్ గతంలో జరిగిన రెండు ఒలింపిక్స్‌లో పతకం గెలవలేకపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా ప‌త‌కం గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో పారిస్ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది.

నిరాశ ప‌రిచిన పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్‌..

టేబుల్ టెన్నిస్‌లో పురుషుల టీమ్ నిరాశ‌ప‌రిచింది. ప్రిక్వార్ట‌ర్స్‌లో చైనా చేతిలో 0-3 తేడాతో ఓడిపోయింది. మొద‌ట డ‌బుల్స్ మ్యాచ్‌లో లాంగ్, వాంగ్ చుకిన్‌ చేతిలో  హర్మీత్‌ దేశాయ్, మానవ్‌ థక్కర్‌ జోడీ 2-11, 3-11, 7-11 తేడాతో ఓడిపోయింది. ఆ త‌రువాత సింగిల్స్ తొలి మ్యాచ్‌లో శ‌ర‌త్ క‌మ‌ల్ సైతం జెండాంగ్ చేతిలో 11-9,7-11, 7-11 తేడాతో ఓడిపోయాడు. కీల‌క‌మైన రెండో సింగిల్స్ మ్యాచ్‌లో మాన‌వ్ థ‌క్క‌ర్ పై వాంగ్ చుకిన్ 9-11,6-11, 9-11 తేడాతో గెలుపొందాడు.
Mashrafe Mortaza : మంట‌ల్లో కాలిపోతున్న బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మోర్తజా ఇళ్లు.. అస‌లేం జ‌రిగిందంటే..?

ట్రెండింగ్ వార్తలు