IND vs SA : రాంచిలో చరిత్ర సృష్టించిన రోహిత్-కోహ్లీ.. సచిన్, ద్రవిడ్ రికార్డ్ బ్రేక్
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA)రాంచి వేదికగా తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది.
- Thota Vamshi Kumar
- Updated on- November 30, 2025 / 01:27 PM IST
Virat Kohli and Rohit Sharma become the most experienced Indian pair with together
IND vs SA : మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రాంచి వేదికగా తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టీమ్ఇండియా తుది జట్టులో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో రో-కో జోడి ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
Abhishek Sharma : అభిషేక్ శర్మ ఊచకోత.. అదేం కొట్టుడు సామీ.. 14 ఫోర్లు, 8 సిక్సర్లు.. షమీ బలి..
వీరిద్దరు భారతదేశం తరపున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జోడీగా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో వీరు దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ జోడీని అధిగమించారు. సచిన్-ద్రావిడ్ జోడి టీమ్ఇండియా తరుపున 391 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగారు. రాంచి మ్యాచ్‌లో (IND vs SA) బరిలోకి దిగడంతో రో-కో ద్వయం వీరి రికార్డును బ్రేక్ చేశారు. రోహిత్-కోహ్లీ తాజా మ్యాచ్‌తో కలిపి 392 అంతర్జాతీయ మ్యాచ్‌లో కలిసి బరిలోకి దిగారు.
టీమ్ఇండియా తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జోడీలు ఇవే..
* రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ – 392* మ్యాచ్‌లు
* సచిన్ టెండూల్కర్ – రాహుల్ ద్రవిడ్ – 391 మ్యాచ్‌లు
* రాహుల్ ద్రవిడ్ – సౌరవ్ గంగూలీ – 369 మ్యాచ్‌లు
* సచిన్ టెండూల్కర్ – అనిల్ కుంబ్లే – 367 మ్యాచ్‌లు
* సచిన్ తెందూల్కర్ – సౌరవ్ గంగూలీ – 341 మ్యాచ్‌లు
* విరాట్ కోహ్లీ – రవీంద్ర జడేజా – 310* మ్యాచ్‌లు
IND vs SA : నేటి నుంచే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. మ్యాచ్‌లను ఫ్రీగా ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
దక్షిణాప్రికాతో తొలి వన్డేకు భారత తుది జట్టు ఇదే..
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్(కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
