Virat Kohli : యోయో టెస్టు పాస్.. పిక్ షేర్ చేసిన కోహ్లీ.. స్కోరెంతంటే..?
భారత క్రికెటర్లలో ఫిట్‌నెస్‌కు మారు పేరు ఎవరు అంటే ఠక్కున అందరూ చెప్పే పేరు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ. తన పదిహేనేళ్ల కెరీర్‌లో ఒక్కసారి కూడా పిట్‌నెస్‌లేమీ, గాయాల కారణంగా జట్టుకు దూరమైన సందర్భాలు దాదాపుగా లేవు.
- Thota Vamshi Kumar
- Published On : August 24, 2023 / 04:35 PM IST
Virat Kohli
Virat Kohli-YoYo test : భారత క్రికెటర్లలో ఫిట్‌నెస్‌కు మారు పేరు ఎవరు అంటే ఠక్కున అందరూ చెప్పే పేరు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli). తన పదిహేనేళ్ల కెరీర్‌లో ఒక్కసారి కూడా పిట్‌నెస్‌లేమీ, గాయాల కారణంగా జట్టుకు దూరమైన సందర్భాలు దాదాపుగా లేనే లేవు. విండీస్, ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లకు కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. విరాట్ తిరిగి ఆసియా కప్(Asia Cup)లోనే మైదానంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ టోర్నీలో రాణించేందుకు చెమటోడుస్తున్నాడు.
ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. భారత జట్టు ఆడే మ్యాచులకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఈ టోర్నీలో ఆడే ఆటగాళ్లు తప్పని సరిగా ఫిట్‌నెస్ టెస్టు పాస్ కావాలని బీసీసీఐ ఆదేశించింది. ఇందుకోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్లేయర్లు అందరికి ప్రిపరేటరీ క్యాంప్‌ను బీసీసీఐ ఏర్పాటు చేసింది. ఇక్కడే ఆటగాళ్లకు ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించింది. ఈ టెస్టు కోసం బెంగళూరు చేరుకున్న కోహ్లీ అందులో పాస్ అయ్యాడు.
Harry Brook : చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా కోహ్లీనే వెల్లడించాడు. ‘కోన్స్ మధ్య యోయో టెస్టు ముగిసింది. 17.2 స్కోరు సాధించా. చాలా ఆనందంగా ఉంది.’ అంటూ ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కోహ్లీ ఓ ఫోటోను షేర్ చేసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్య, రవీంద్ర జడేజా తదితరులు కూడా ఈ ఫిట్‌నెస్ టెస్టుకు హాజరుకానున్నారు.
గతేడాది టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ టోర్నీలో కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఈ టోర్నీలో టీమ్ఇండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సారి వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీలో మరోసారి రాణించి వన్డే ప్రపంచకప్‌కు ముందు సూపర్ ఫామ్ అందుకోవాలని అతడి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Virat Kohli
IRE vs IND 3rd T20 : ఒక్క బంతి పడలేదు.. మ్యాచ్ రద్దు.. సిరీస్ టీమ్ఇండియాదే
