Virat Kohli: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ

లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేశాడు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. వన్డే ఫార్మాట్ లో సచిన్ చేసిన 5వే ల65పరుగుల రికార్డు బ్రేక్ చేశాడు. ఫీట్ సాధించడానికి కోహ్లీ

Virat Kohli: లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేశాడు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. వన్డే ఫార్మాట్ లో సచిన్ చేసిన 5వే ల65పరుగుల రికార్డు బ్రేక్ చేశాడు. ఈ ఫీట్ సాధించడానికి కోహ్లీ 104 ఇన్నింగ్స్ మాత్రమే తీసుకున్నాడు.

ఈ జాబితాలోని టాప్ 5 బ్యాట్స్‌మెన్ వివరాలిలా ఉన్నాయి. విరాట్ కోహ్లీ, సచిన్ ల తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ (4520 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (3998 పరుగులు), సౌరవ్ గంగూలీ (3468 పరుగులు)లతో తర్వాతి స్థానంలో నిలిచారు.

అంతర్జాతీయ క్రికెటర్లతో పోలిస్తే వన్డే పరుగుల్లో విరాట్ మూడో స్థానంలో ఉన్నాడు. అంతకంటే ముందు శ్రీలంక ప్లేయర్ కుమార్ సంగక్కర (5వేల 518పరుగులు), రిక్కీ పాంటింగ్ (5వేల 90 పరుగులు)తో టాప్ 2స్థానాల్లో ఉన్నారు.

ఇది కూడా చదవండి : తెలంగాణలో మరోసారి జ్వర సర్వే

అంతేకాకుండా సౌతాఫ్రికాపై వెయ్యి 287పరుగులు చేసిన ఈ మాజీ కెప్టెన్.. ద్రవిడ్, గంగూలీ రికార్డులను కూడా బ్రేక్ చేసేశాడు. సఫారీ ప్లేయర్లపై టెండూల్కర్ నమోదు చేసిన 2001 వన్డే పరుగులను కూడా ఇదే ఇన్నింగ్స్ లో 27వ పరుగుతో దాటేశాడు.

ఓవరాల్ గా చూస్తే సౌతాఫ్రికాపై ఎక్కువ స్కోరు నమోదు చేసిన ప్లేయర్లలో కోహ్లీ టాప్ 6గా ఉన్నారు. రిక్కీ పాంటింగ్ (1879 పరుగులు), కుమార సంగక్కర్ (1789 పరుగులు), స్టీవ్ వా (1581 పరుగులు), శివనరైన్ చండేపాల్ (1559 పరుగులు) నమోదు చేశాడు.

ట్రెండింగ్ వార్తలు