Virat Kohli: ‘కోహ్లీ అలా చెప్పి ఉండకూడదు.. సెప్టెంబరులోనే అడిగాం’

: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ప్లేయర్లతో కమ్యూనికేషన్ సమస్యలతో చాలా కాలంగా పలు విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రెసిడెంట్ గా సౌరవ్ గంగూలీ వచ్చాక దీనికి ముగింపు .

Kohli

Virat Kohli: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ప్లేయర్లతో కమ్యూనికేషన్ సమస్యలతో చాలా కాలంగా పలు విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రెసిడెంట్ గా సౌరవ్ గంగూలీ వచ్చాక దీనికి ముగింపు వస్తుందని ఆశించినా.. విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తొలగింపుపై మరోసారి చర్చనీయాంశమైంది. దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టుల మ్యాచ్ సిరీస్ కు ముందు కోహ్లీ చేసిన కామెంట్లు ఈ వివాదానికి తెరలేపాయి.

బీసీసీఐ చీఫ్ టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ రిటైర్మెంట్ విషయంలో వద్దని అనలేదని మీడియా ముఖంగా చెప్పాడు. దీనిపై బీసీసీఐ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. విరాట్ ను సెప్టెంబరులోనే అడిగామని ఇలా చెప్పడం సరికాదని అన్నారు.

‘విరాట్ కోహ్లీ అలా చెప్పి ఉండకూడదు. అతణ్ని మేం గందరగోళంలో పడేయలేదు. సెప్టెంబరులోనే టీ20 కెప్టెన్సీ గురించి మాట్లాడాం. ఒకసారి విరాట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇద్దరు వైట్ బాల్ కెప్టెన్స్ ఉండకూడదని అనుకున్నాం. చేతన శర్మ వన్డే కెప్టెన్సీ గురించి మీటింగ్ జరగకముందు ఉదయమే మాట్లాడారు’ అని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

………………………………………………… : స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్

కోహ్లీ కామెంట్లు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. ‘టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేయాలని బీసీసీఐని సంప్రదించినప్పుడు నేనేం అనుకుంటున్నానో చెప్పాను. కారణాలు వారి ముందుంచాను. వాటిని సానుకూలంగానే తీసుకున్నారు. ఎవరూ వాటికి అభ్యంతరం చెప్పలేదు. టీ20 కెప్టెన్సీ వదలొద్దని కూడా అడ్డుకోలేదు’ అని కోహ్లీ అన్నాడు.

‘కొందరేమో అగ్రెసివ్ అయినప్పటికీ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. అదే సమయంలో వన్డేకు, టెస్టు ఫార్మాట్లకు కెప్టెన్ గా ఉంటానని బీసీసీఐకి అప్పుడే చెప్పా. ఇదంతా ఫోన్ కాల్ లోనే క్లారిటీ ఇచ్చా. బీసీసీఐతో నా కమ్యూనికేషన్ చాలా క్లియర్ గా ఉంది. దీనిపై బీసీసీఐ ఆఫీస్ బేరర్స్ వేరేదైనా నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే’ అని కూడా చెప్పానని విరాట్ వివరించాడు.

 

: కేంద్రమంత్రి అజయ్ మిశ్రాకు ఢిల్లీ పెద్దల పిలుపు.. మంత్రిపదవి ఊడినట్లేనా?