2010లో జరిగిన చాంపియన్స్ లీగ్ టీ20లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్ తన కెరీర్లో బెస్ట్ మ్యాచ్ అని తెలిపాడు. ముంబై ఇండియన్స్ పై తలపడి వికెట్లు పడిపోతున్నా.. ఆట చివరి వరకూ 49 పరుగులు చేసి నిలిచి ఉండడం నాకు గుర్తుండిపోయే క్షణాలు అని తెలియజేశాడు.
సజట్టులో ప్రతి ప్లేయర్ చేతులెత్తేశారు. కానీ, నేను చివరి వరకూ క్రీజులో ఉన్నాను. దాదాపు గెలుపు మాదే అని భావించాం. అది నాకు చాలా ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చింది. ఆట చూసిన వాళ్లంతా చివర్లో వచ్చి నన్ను అభినందించారు’ అని తెలిపాడు.
ఆ ముంబై జట్టులో జహీర్ ఖాన్, సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్‌లు ఉన్నారు. అదే నా గేమ్‌కు పేరు తెచ్చిపెట్టిందనుకుంటున్నా. ముంబై ఇండియన్స్‌లో చివరి ఓవర్ వేసింది జహీర్ ఖాన్.. అయినా క్రీజులో నిలిచా. ఆ రోజే నా ఆట ఏంటో సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్ లకు కూడా తెలిసింది. అదొక అద్భుతమైన క్షణం’ అని కోహ్లీ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.