Rohit sharma : అర్ధరాత్రి ఆస్పత్రికి రోహిత్ శర్మ.. ఆందోళనలో అభిమానులు.. అసలేం జరిగిందంటే..
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit sharma) సోమవారం రాత్రి ముంబయిలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. దీంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

Rohit sharma
Rohit sharma : టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం అర్ధరాత్రి ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రోహిత్ శర్మకు ఏమైంది అంటూ ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, రోహిత్ ఆస్పత్రికి ఎందుకు వెళ్లాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆస్పత్రికి యాజమాన్యంసైతం ఈ విషయంపై స్పందించలేదు.
Also Read: Asia cup 2025 : నేటి నుంచే ఆసియాకప్.. పూర్తి షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లను ఎక్కడ చూడొచ్చంటే..?
రోహిత్ శర్మ కేవలం సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగానే ఆస్పత్రికి వెళ్లాడని తెలుస్తోంది. బిజీ క్రికెట్ షెడ్యూల్‌కు ముందు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం సాధారణమైన విషయమేనని కొందరు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. అయితే, తన బంధువులు, స్నేహితుల్లో ఎవరో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో వారిని పరామర్శించేందుకు రోహిత్ అక్కడికి వెళ్లి ఉండొచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. మొత్తానికి రోహిత్ శర్మ రాత్రివేళ ఆస్పత్రికి వెళ్లడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు టెస్టు క్రికెట్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రోహిత్ చాలా రోజులుగా మైదానంకు దూరంగా ఉంటున్నాడు. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత రోహిత్ భారత జట్టు తరపున ఆడలేదు. టీమిండియా వన్డే కెప్టెన్‌గా ఉన్న అతను ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‍కు సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.
ROHIT SHARMA AT THE KOKILABEN HOSPITAL IN MUMBAI. (Pallav Paliwal).
— Tanuj (@ImTanujSingh) September 8, 2025
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ సన్నద్ధమవుతున్నాడు. ఇప్పటికే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సులో తన ఫిట్నెస్ పరీక్షను కూడా రోహిత్ పూర్తి చేశాడు. 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ మెగా టోర్నీ వరకు భారత జట్టులో కొనసాగాలని రోహిత్ శర్మ భావిస్తున్నాడు.
ఆస్ట్రేలియా పర్యటన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి కూడా కీలకమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు ప్లేయర్లు 2027 వన్డే ప్రపంచ కప్ వరకు భారత జట్టులో ఆడాలని భావిస్తున్నారు. ఒకవేళ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ లో వీరు విఫలమైతే రాబోయే వన్డే సిరీస్ లకు వారిని సెలెక్టర్లు దూరంపెట్టే అవకాశాలు లేకపోలేదు.