Virat Kohli : అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్న కోహ్లి..

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli) అరుదైన ఘ‌న‌త సాధించాడు. మల్టీ నేషన్ టోర్నమెంట్‌లలో 100 క్యాచ్‌లు అందుకున్నాడు.

Virat Kohli Completes 100 Catches In Multi Nation Tournaments

Kohli : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli) అరుదైన ఘ‌న‌త సాధించాడు. మల్టీ నేషన్ టోర్నమెంట్‌లలో 100 క్యాచ్‌లు అందుకున్నాడు. ఆసియాక‌ప్ (Asia Cup) 2023లో భాగంగా నేపాల్‌తో జ‌రుగుతున్న‌ మ్యాచ్‌లో ఆసిఫ్ షేక్ క్యాచ్‌ను అందుకోవ‌డం ద్వారా కోహ్లి ఈ ఫీట్‌ను చేరుకున్నాడు. త‌ద్వారా భార‌త మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) త‌రువాత ఈ ఘ‌న‌త సాధించిన రెండో నాన్ వికెట్ కీప‌ర్‌గా విరాట్ కోహ్లి రికార్డుల‌కు ఎక్కాడు.

Rishabh Pant : రీ ఎంట్రీ కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్న‌ రిష‌బ్ పంత్.. వీడియో వైర‌ల్‌

నేపాల్ ఇన్నింగ్స్‌లో 30వ ఓవ‌ర్‌ను మ‌హ్మ‌ద్ సిరాజ్ వేశాడు. ఐదో బంతిని ఆసిఫ్ షేక్ షాట్ ఆడ‌గా విరాట్ చ‌క్క‌ని క్యాచ్ అందుకున్నాడు. అయితే.. అంత‌క‌ముందు ఆసిఫ్ షేక్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ కోహ్లి జార విడిచాడు. దీంతో హాఫ్ సెంచ‌రీ చేసిన ఆసిఫ్ త‌న జ‌ట్టుకు గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు సాధించ‌డంలో త‌న వంతు సాయం చేశాడు.

Jasprit Bumrah : తండ్రైన జ‌స్‌ప్రీత్ బుమ్రా.. చిన్నారి పేరేంటో తెలుసా..?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన నేపాల్ జ‌ట్టు 48.2 ఓవ‌ర్ల‌లో 230 ప‌రుగుల‌కు ఆలౌటైంది. నేపాల్ బ్యాట‌ర్ల‌లో ఆసిఫ్ షేక్ (58; 97 బంతుల్లో 8 ఫోర్లు) అర్థ‌శ‌త‌కంతో ఆక‌ట్టుకోగా సోంపాల్ కామి (48) కుశాల్ భుర్టెల్ (38), దీపేంద్ర సింగ్ ఐరీ (29)లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌లు చెరో మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, మహ్మ‌ద్ ష‌మి, హార్దిక్ పాండ్య‌, శార్దూల్ ఠాకూర్ లు ఒక్కొ వికెట్ తీశారు.

ట్రెండింగ్ వార్తలు