Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
టీ20 క్రికెట్‌లో ఒకే వేదిక పై 3500 పరుగులు చేసిన తొలి భారత క్రికెట్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ 105 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 3500 రన్స్ చేశాడు.
ఒకే వేదిక పై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు..
విరాట్ కోహ్లీ (భారత్) – బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం – 3500 పరుగులు
ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్) – మీర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియం – 3373 పరుగులు
జేమ్స్ విన్స్ (ఇంగ్లాండ్) – సౌతాంప్టన్‌లో రోజ్ బౌల్ – 3253 పరుగులు
అలెక్స్ హేల్స్ (ఇంగ్లాండ్) – నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ – 3241 పరుగులు
తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్) – మీర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియం – 3238 పరుగులు
టీ20ల్లో అత్యధిక 50 ఫ్లస్ స్కోర్లు..
పొట్టి ఫార్మాట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సందర్భాల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డులకు ఎక్కాడు. 62 సార్లు కోహ్లీ 50 ఫ్లస్ స్కోర్లు నమోదు చేశాడు. ఈ క్రమంలో బాబర్ అజామ్ రికార్డును బద్ధలు కొట్టాడు. బాబర్ 61 సార్లు ఈ ఘనత సాధించాడు. వీరిద్దరి తరువాత క్రిస్‌గేల్, డేవిడ్ వార్నర్‌లు ఉన్నారు.
టీ20ల్లో మొదట బ్యాటింగ్ చేసినప్పుడు అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆటగాళ్లు వీరే..
విరాట్ కోహ్లీ – 62 సార్లు
బాబర్ అజామ్ – 61 సార్లు
క్రిస్ గేల్ – 57 సార్లు
డేవిడ్ వార్నర్ – 55 సార్లు
జోస్ బట్లర్ – 52 సార్లు
ఫాఫ్ డు ప్లెసిస్ – 52 సార్లు