Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్ గడ్డపై ఏకైక ఆటగాడు..
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో ఘనత సాధించాడు.
- Thota Vamshi Kumar
- Published on- July 17, 2026 / 07:19 AM IST
Virat Kohli creates history Scoring Most Runs For India In England
Virat Kohli : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కార్డిఫ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో వ్యక్తిగత స్కోరు 4 పరుగుల వద్ద కోహ్లీ ఈ రికార్డును అందుకున్నాడు.
రాహుల్ ద్రవిడ్ 46 మ్యాచ్‌ల్లో 2645 పరుగులు చేయగా కోహ్లీ 59 మ్యాచ్‌ల్లో అతడిని అధిగమించాడు. ఇక ఈ జాబితాలో కోహ్లీ, ద్రవిడ్ తరువాతి స్థానాల్లో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు ఉన్నారు. కాగా.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 66 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 65 పరుగులు సాధించాడు.
Rohit Sharma : రోహిత్‌శర్మ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఎల్లుండే హిట్‌మ్యాన్‌కు ఆఖరి మ్యాచ్!
ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు వీరే..
* విరాట్ కోహ్లీ – 59 మ్యాచ్‌ల్లో 2707 పరుగులు
* రాహుల్ ద్రవిడ్ – 46 మ్యాచ్‌ల్లో 2645 పరుగులు
* సచిన్ టెండూల్కర్ – 43 మ్యాచ్‌ల్లో 2626 పరుగులు
* రోహిత్ శర్మ – 48 మ్యాచ్‌ల్లో 2308 పరుగులు
* సౌరవ్ గంగూలీ – 36 మ్యాచ్‌ల్లో 1949 పరుగులు
* ఎంఎస్ ధోని – 60 మ్యాచ్‌ల్లో 1869 పరుగులు
ఇంగ్లాండ్ పై అత్యధిక 50ఫ్లస్ స్కోర్లు..
ఈ మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఇంగ్లాండ్ పై అత్యధిక సార్లు 50 ఫ్లస్ స్కోరు చేసిన భారత ఆటగాడిగానూ నిలిచాడు. ఈ క్రమంలో అతడు సచిన్‌ను అధిగమించాడు. ఇంగ్లాండ్ పై సచిన్ 32 సార్లు 50 ఫ్లస్ స్కోర్లు నమోదు చేయగా.. తాజా మ్యాచ్‌తో కలిపి కోహ్లీ 33 సార్లు ఈ ఘనత సాధించాడు.
IND vs ENG : అదే మా కొంపముంచింది.. రెండో వన్డే ఓటమి తరువాత శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు
ఇంగ్లాండ్ పై అత్యధిక సార్లు 50+స్కోర్లు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
* విరాట్ కోహ్లీ – 33 సార్లు
* సచిన్ టెండూల్కర్ – 32 సార్లు
* రాహుల్ ద్రవిడ్ – 26 సార్లు
* ఎంఎస్ ధోని – 24 సార్లు
* సునీల్ గవాస్కర్ – 23 సార్లు
