Amanpreet Singh Gill : భారత క్రికెట్‌లో విషాదం.. విరాట్ కోహ్లీ మాజీ సహచరుడు అమన్‌ప్రీత్ సింగ్ గిల్ కన్నుమూత..
భారత అండర్-19 మాజీ ఆటగాడు, పంజాబ్ మీడియం పేసర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ (Amanpreet Singh Gill) కన్నుమూశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 7, 2026 / 01:05 PM IST
Virat Kohli Ex U19 Teammate Amanpreet Singh Gill dies
Amanpreet Singh Gill : భారత క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. భారత అండర్-19 మాజీ ఆటగాడు, పంజాబ్ మీడియం పేసర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ కన్నుమూశాడు. 36 ఏళ్ల వయసులోనే అతడు హఠాన్మరణం చెందడం క్రీడాభిమానులు, ప్లేయర్లు, ఫ్యాన్స్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు.
అమన్‌ప్రీత్ సింగ్ గిల్ తన క్రికెట్ ప్రయాణంలో విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లలతో కలిసి ఆడాడు. భారత అండర్-19 తరుపున వీరు కలిసి ఆడారు. ఇక అమన్ భారత యువ జట్టు తరుపున ఐదు వన్డేలు, ఓ టెస్టు మ్యాచ్ ఆడి మొత్తంగా 11 వికెట్లు పడగొట్టాడు. ఆ సమయంలో లంక జట్టు దిగ్గజ ఆల్‌రౌండర్ తిసారా పెరీరా వికెట్ తీసి అందరి దృష్టిని ఆకర్షించినప్పటికి కూడా దురదృష్టవశాత్తు 2008లో విరాట్ కోహ్లీ సారథ్యంలో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో అతడికి చోటు దక్కలేదు.
Cooper Connolly : చరిత్ర సృష్టించిన కూపర్ కొన్నోలీ.. ఏకైక విదేశీ ఆటగాడు..
ఐపీఎల్‌లో ఆరంభ ఎడిషన్‌లో పంజాబ్ ఫ్రాంచైజీ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్)లో సభ్యుడిగా ఉన్నాడు. అనంతరం పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడిగానూ పనిచేశాడు. ఆయన మృతి పట్ల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది.
Punjab Cricket Association deeply mourns the sad demise of Amanpreet Singh Gill, former Punjab cricketer and Member, Senior Selection Committee Punjab.
He served Punjab cricket with dedication and passion, representing teams including India Under-19s, Kings XI Punjab and Punjab.… pic.twitter.com/tpr0EwEprk
— Punjab Cricket Association (@pcacricket) May 6, 2026
“పంజాబ్ మాజీ క్రికెటర్, పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడు అయిన అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మృతి పట్ల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది,” అని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
Pat Cummins : పంజాబ్ పై విజయం.. ట్రావిస్ హెడ్ నిద్ర.. పాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
Deeply saddened to hear about Amanpreet Singh Gill’s passing. Shared the dressing room in our early days, he was a quiet, hardworking cricketer who loved the game. My heartfelt condolences to his family and loved ones. Rest in peace 🙏🏻 Om Shanti#AmanpreetSinghGill@pcacricket
— Yuvraj Singh (@YUVSTRONG12) May 6, 2026
“అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మరణవార్త విని చాలా బాధపడ్డాను. మా కెరీర్ తొలినాళ్లలో నేను అతనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాను. అతను నిశ్శబ్దంగా ఉంటూ కష్టపడి పనిచేసే క్రికెటర్. ఆటను ఎంతగానో ప్రేమించేవాడు. అతని కుటుంబానికి, ప్రియమైన వారికి నా ప్రగాఢ సానుభూతి. అతని ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి,” అని యువరాజ్ సింగ్ తెలిపాడు.
