WI vs IND 1st Test : ఫోర్ కొట్టి సంతోషాన్ని వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ.. ఆ ఫోర్ ప్రత్యేకతేమిటో తెలుసా? వీడియో వైరల్ ..

రోహిత్ ఔట్ అయిన తరువాత.. క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ వెంటనే పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ జైస్వాల్‌తో కలిసి ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు.

Virat kohli

Virat kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నాడంటే బౌండరీల మోత మోగడం ఖాయం. కోహ్లీ సెంచరీ చేశాడంటే అందులో ఫోర్ల రూపంలోనే అత్యధిక పరుగులు ఉంటాయి. అలాంటి విరాట్ కోహ్లీ.. ఒక్క ఫోర్ కొట్టి తన సంతోషాన్ని వెలుబుచ్చాడు. ఆ ఫోర్‌ కు అంత స్పెషాలిటీ ఏమిటా అని మీకు డౌట్ రావచ్చు. విరాట్ ఫోర్ కొట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

WI vs IND 1ST Test : అదరగొడుతున్న యశస్వీ జైస్వాల్ .. అభినందించిన జై షా.. భారీ ఆధిక్యం దిశగా భారత్..

వెస్టిండీస్‌లో డొమినికా వేదిక‌గా భార‌త్‌, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. తొలిరోజు ఆటలో వెస్టిండీస్ జ‌ట్టును 150 ప‌రుగుల‌కే టీమిండియా బౌలర్లు ఆలౌట్ చేయగా.. రెండో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ సెంచరీల మోతమోగించారు. ఓవర్ నైట్ స్కోర్ 80/0తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా బ్యాటర్లు.. తొలి సెషన్‌లో కొంచెం నెమ్మదిగా ఆడారు ఫలితంగా వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తరువాత దూకుడుగా ఆడుతూ భారత్ స్కోర్ ను పరుగు పెట్టించారు. ఈ క్రమంలోనే ఓపెనర్లు రోహిత్, జైస్వాల్ సెంచరీలు చేశారు.

Ind vs WI : మ‌హ్మ‌ద్ సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్.. శుభ్‌మన్ గిల్ అదిరిపోయే డ్యాన్స్‌.. వీడియోలు వైర‌ల్‌

రోహిత్ ఔట్ అయిన తరువాత.. క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ వెంటనే పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ జైస్వాల్‌తో కలిసి ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. అయితే, విరాట్ కోహ్లీ రెండోరోజు ఆట ముగిసే సమయానికి 96 బంతులు ఎదుర్కొని 36 పరుగులు చేశాడు. ఈ మొత్తం స్కోర్‌లో కోహ్లీ కొట్టింది ఒక్క ఫోర్ మాత్రమే. అదికూడా తాను ఎదుర్కొన్న 81వ బంతికి తొలి ఫోర్ కొట్టాడు. ఈ సందర్భంగా కోహ్లీ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఫోర్ తరువాత కోహ్లీ నవ్వులు చిందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. బాబోయ్.. విరాట్ కోహ్లీనేనా ఆడేది.. 81 బంతులకు ఒక్క ఫోర్ కొట్టలేదా? అని ఆశ్చర్య పోతూ కామెంట్ల చేస్తున్నారు. మరికొందరు.. సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా లేని లోటును విరాట్ తీరుస్తున్నాడంటూ కామెంట్ల చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు