చెత్త రికార్డులోనూ కోహ్లీనే టాప్

టీమిండియా కెప్టెన్.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టాప్ రికార్డుల్లోనే కాదు.. చెత్త రికార్డుల్లోనూ తానే టాప్ గా ఉన్నాడు. మంగళవారం ముంబైలోని వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆసీస్‌తో మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత కెప్టెన్‌గా కోహ్లీ చెత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. 

ఇలా అవుట్ అయిన భారత జట్టుకు తొలి కెప్టెన్ కాగా, న్యూజిలాండ్ 1981లో, వెస్టిండీస్ 1997లో, దక్షిణాఫ్రికా 2000లో, 2005లో ఇలా ఆల్ అవుట్ గా సరిపెట్టుకున్నాయి. ఇక రాజ్‌కోట్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో భారత్ కోలుకునేట్లుగానే కనిపిస్తుంది. బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యం జట్టును ముంచిదనే చెప్పాలి. లోపాలు సరిదిద్దుకుని రెండో వన్డే నాటికి సిద్ధమై గెలిస్తేనే గానీ, సిరీస్ గెలవడం పై ఆశలు సజీవంగా ఉండవు. 

భారత్ టూర్‌లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. భారత్‌పై  10వికెట్ల తేడాతో విజయేకేతనం ఎగురవేసింది. మూడు విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా ఆశలు గల్లంతు చేసింది. భారత్ నిర్దేశించిన 256పరుగుల లక్ష్యాన్ని 38వ ఓవర్లోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆడి గెలిచేసింది.  

వార్నర్(128: 112 బంతుల్లో 17ఫోర్లు, 3సిక్సులు), ఆరోన్ ఫించ్(110; 114బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సులు)తో టార్గెట్ కొట్టేశారు. వన్డే ఫార్మాట్‌లో భారత్ జట్టుపై 249పరుగులతో అత్యధిక పరుగులు చేసిన జోడీగా రికార్డులకెక్కారు. 

ట్రెండింగ్ వార్తలు