Virat Kohli : కోహ్లీ చేసిన ప‌నికి ద‌క్షిణాఫ్రికా స్టార్ స్పిన్న‌ర్ ఫిదా.. ఇది క‌దా కోహ్లీ అంటే..

టీమ్ఇండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ చేసిన ఓ ప‌ని ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Virat Kohli-Keshav Maharaj

Virat Kohli-Keshav Maharaj : కేప్‌టౌన్ వేదిక‌గా భారత్‌, ద‌క్షిణాప్రికా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్ కేవ‌లం రెండు రోజుల్లోనే ముగిసింది. టీమ్ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో స‌మమైంది. ఇక మ్యాచ్ ముగిసిన త‌రువాత టీమ్ఇండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ చేసిన ఓ ప‌ని ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ద‌క్షిణాఫ్రికా స్టార్ స్పిన్న‌ర్ కేశ‌వ్ మ‌హ‌రాజ్‌కు తాను సంత‌కం చేసిన త‌న జెర్సీని కోహ్లీ బ‌హుమ‌తిగా ఇచ్చాడు.

కేశ‌వ్‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ విరాట్ అత‌డికి ఈ కానుక ఇచ్చాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కేశ‌వ్ మ‌హ‌రాజ్ వెల్ల‌డించాడు. ‘వ‌న్ ఫ‌ర్ ది వాల్‌, ధ‌న్య‌వాదాలు కోహ్లీ’ అంటూ భార‌త మాజీ కెప్టెన్ నంబ‌ర్ 18 జెర్సీని అందుకుంటున్న ఫోటోను అభిమానుల‌తో పంచుకున్నాడు. ఈ ఫోటో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇది మాత్ర‌మే కాదు.. త‌న కెరీర్‌లో ఆఖ‌రి టెస్టు మ్యాచ్ ఆడిన డీన్ ఎల్గ‌ర్‌కు కూడా విరాట్ త‌న జెర్సీని కానుక‌గా ఇచ్చాడు. టీమ్ఇండియా ఆట‌గాళ్ల సంత‌కాల‌తో కూడిన జెర్సీని కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఎల్గ‌ర్ కు ఇచ్చాడు.

AUS vs PAK : పాక్ ఆట‌గాడి క్యాప్‌ను తాకి ఆగిన బంతి.. 5 ప‌రుగుల పెనాల్టీ ఇవ్వ‌ని అంపైర్‌.. నెట్టింట ర‌చ్చ‌..

 

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ద‌క్షిణాప్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. మొద‌టి ఇన్నింగ్స్లో 55 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 153 ప‌రుగులు చేసింది. దీంతో కీల‌కమైన 98 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం భార‌త్‌కు ల‌భించింది. అనంత‌రం మార్‌క్ర‌మ్ సెంచ‌రీ చేయ‌డంతో ద‌క్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 176 ప‌రుగులు చేసింది. మొద‌టి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని తీసివేయ‌గా టీమ్ఇండియా ముందు 79 విజ‌య ల‌క్ష్యం నిలిచింది.

ఈ ల‌క్ష్యాన్ని భార‌త్ 12 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో య‌శ‌స్వి జైస్వాల్ (28), రోహిత్ శ‌ర్మ (17నాటౌట్‌)లు రాణించారు. స‌పారీ బౌల‌ర్ల‌లో బౌల‌ర్ల‌లో నాంద్రే బర్గర్, క‌గిసో ర‌బాడ, మార్కో జాన్సెన్ లు త‌లా ఓ వికెట్ తీశారు.

Rohit Sharma: మమ్మల్నే అంటారా? అంటూ రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు