AUS vs PAK : పాక్ ఆట‌గాడి క్యాప్‌ను తాకి ఆగిన బంతి.. 5 ప‌రుగుల పెనాల్టీ ఇవ్వ‌ని అంపైర్‌.. నెట్టింట ర‌చ్చ‌..

మూడో రోజు ఆట‌లో చోటు చేసుకున్న ఓ ఘ‌ట‌న ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

AUS vs PAK : పాక్ ఆట‌గాడి క్యాప్‌ను తాకి ఆగిన బంతి.. 5 ప‌రుగుల పెనాల్టీ ఇవ్వ‌ని అంపైర్‌.. నెట్టింట ర‌చ్చ‌..

How Pakistan Avoided Five Run Penalty Despite Ball Landing In Player Cap

Australia vs Pakistan : సిడ్నీ వేదిక‌గా ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జ‌ట్లు మూడో టెస్టు మ్యాచులో త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచులో మూడో రోజు ఆట‌లో చోటు చేసుకున్న ఓ ఘ‌ట‌న ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పాకిస్తాన్ ఆట‌గాడు ఆయుబ్ ఫీల్డింగ్ చేస్తూ కింద ప‌డ్డాడు.ఈ క్ర‌మంలో అత‌డి క్యాప్ మైదానంలో ప‌డింది. బంతి ఆ క్యాప్ లోప‌లికి వెళ్లింది. దీంతో ఆస్ట్రేలియా జ‌ట్టుకు పెనాల్టీ రూపంలో ఐదు ప‌రుగులు ఇస్తార‌ని అంతా భావించారు.

అయితే.. అంపైర్ మాత్రం ఎలాంటి పెనాల్టీ విధించ‌లేదు. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా నెట్టింట దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. అంపైర్ పెనాల్టీ కింద ఐదు ప‌రుగులు ఎందుకు ఇవ్వ‌లేదు అనే విష‌యం పై నెటిజ‌న్లు రెండు వ‌ర్గాలుగా విడిపోయారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఐదు ప‌రుగులు ఇవ్వాల్సిందేన‌ని కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. కాగా.. దీని పై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సోష‌ల్ మీడియా వేదిక‌గా వివ‌ర‌ణ ఇచ్చింది.

Rohit Sharma: మమ్మల్నే అంటారా? అంటూ రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్

పెనాల్టీ ఎందుకు ఇవ్వ‌లేదంటే..?

ఈ సంద‌ర్భంలో ఐదు ప‌రుగులు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది. ఎందుకంటే ఇది ఉద్దేశ్య‌పూర్వ‌కంగా జ‌రిగింది కాద‌ని, యాక్సిడెంట‌ల్‌గా జ‌రిగింది అని చెప్పింది. బాల్‌, క్యాప్ అనుకోకుండా అలా తాకాయని, మైదానంలో క్యాప్‌ను ఉంచిన‌ప్పుడు అలా జ‌ర‌గ‌లేదంది. హెల్మెట్ లేదా క్యాప్ ఇలా ఏదైనా కానివ్వండి గ్రౌండ్‌లో ఉంచిన స‌మ‌యంలో బంతి తాకితే మాత్రం అప్పుడు ఖ‌చ్చితంగా పెనాల్టీ రూపంలో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు ఐదు ప‌రుగులు ఇవ్వాల్సిందేన‌ని తెలిపింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లోనూ పాకిస్తాన్‌కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు కోల్పోయి 68 ప‌రుగులు చేసింది. మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (6), ఆమిర్ జ‌మాల్ (0) లు ఉన్నారు. ప్ర‌స్తుతం పాక్ 82 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. హేజిల్‌వుడ్ (4/9) ఒకే ఓవ‌ర్‌లో మూడు వికెట్లు తీసి పాక్‌ను గ‌ట్టి దెబ్బ‌కొట్టాడు. మిచెల్ స్టార్క్‌, ట్రావిస్ హెడ్‌, నాథ‌న్ లైయన్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Jasprit Bumrah : కేప్‌టౌన్‌లో బుమ్రా రికార్డులు.. ఒకే ఒక్క భార‌తీయుడు..!

పాకిస్తాన్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 313 ప‌రుగులు చేయ‌గా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 299 ప‌రుగుల‌కే ఆలౌటైంది. కాగా.. ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌కు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఇదే ఆఖ‌రి టెస్టు మ్యాచ్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ మ్యాచ్ త‌రువాత సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కొలు ప‌లుకుతున్న‌ట్లు వార్న‌ర్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.