Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త‌.. వ‌న్డే దిగ్గ‌జాలు స‌చిన్, ద్రావిడ్ స‌ర‌స‌న చోటు..

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) మ‌రో మైలురాయిని చేరుకున్నాడు.

Virat Kohli Joins Sachin Tendulkar And Rahul Dravid In Elite ODI List

  • కోహ్లీ అరుదైన ఘ‌న‌త‌
  • భార‌త్ త‌రుపున వ‌న్డేల్లో 350 ఇన్నింగ్స్‌

Virat Kohli : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మ‌రో మైలురాయిని చేరుకున్నాడు. స‌చిన్ టెండూల్క‌ర్‌, రాహుల్ ద్ర‌విడ్‌, మ‌హమ్మ‌ద్ అజారుద్దీన్‌, సౌర‌వ్ గంగూలీల త‌రువాత వ‌న్డే క్రికెట్‌లో 300 ఇన్నింగ్స్‌ల ఆడిన ఐదో భార‌త క్రికెట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. మంగ‌ళ‌వారం ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డే ద్వారా కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. కోహ్లీకి ఇది 312వ వ‌న్డే మ్యాచ్‌.

ఇక ఓవ‌రాల్‌గా చూసుకుంటే 452 ఇన్నింగ్స్‌ల‌తో స‌చిన్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాతి స్థానాల్లో స‌న‌త్ జ‌య‌సూర్య‌(433), మ‌హేలా జ‌య‌వ‌ర్ధ‌నే (418)లు ఉన్నారు.

IND vs ENG : గెలుపు జోష్‌లో ఉన్న భార‌త్‌కు భారీ షాక్..!

కాగా.. ఇంగ్లాండ్‌తో తొలి వ‌న్డేలో కోహ్లీ విఫ‌లం అయ్యాడు. 6 బంతుల్లో 5 ప‌రుగులు మాత్ర‌మే చేసి జోఫ్రా ఆర్చ‌ర్ బౌలింగ్‌లో ఎల్బీడ‌బ్ల్యూగా పెవిలియ‌న్ కు చేరుకున్నాడు. కోహ్లీతో పాటు రోహిత్ శ‌ర్మ (11) విఫ‌లం అయినా కూడా భార‌త జ‌ట్టు 6 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించింది.

జోరూట్ (76 నాటౌట్‌), లియామ్ డాస‌న్ (68)లు రాణించ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 47.5 ఓవ‌ర్ల‌లో 258 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భార‌త బౌల‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్ నాలుగు వికెట్లు తీశాడు. ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, గుర్నూర్ బ్రార్ లు చెరో రెండు వికెట్లు తీశారు. జ‌స్‌ప్రీత్ బుమ్రా, శివ‌మ్ దూబె లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు. ఆత‌రువాత శుభ్‌మ‌న్ గిల్ (80 రిటైర్డ్ హ‌ర్ట్)తో పాటు వాషింగ్ట‌న్ సుంద‌ర్ (52 నాటౌట్), అక్ష‌ర్ ప‌టేల్ (57 నాటౌట్‌)లు రాణించ‌డంతో 259 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 45.2 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.