Virat Kohli : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో కోహ్లీలా.. బ‌ర్త్ డే రోజునే సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు వీళ్లే..

బ‌ర్త్ డే అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ఇక క్రీడాకారుల విష‌యానికి వ‌స్తే ఆ రోజు తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క్రీడ‌ల్లో ఏదైన రికార్డును నెల‌కొల్పి మెమ‌ర‌బుల్‌గా మార్చుకోవాల‌ని భావిస్తుంటారు.

Virat Kohli

Virat Kohli birthday : బ‌ర్త్ డే అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ఇక క్రీడాకారుల విష‌యానికి వ‌స్తే ఆ రోజు తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క్రీడ‌ల్లో ఏదైన రికార్డును నెల‌కొల్పి మెమ‌ర‌బుల్‌గా మార్చుకోవాల‌ని భావిస్తుంటారు. అయితే.. అది అంద‌రికి సాధ్యం కాదు. కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే అధి సాధ్య‌మ‌వుతుంది. కాగా.. టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పుట్టిన రోజు నేడు(న‌వంబ‌ర్ 5). త‌న బ‌ర్త్ డే రోజున సెంచ‌రీ చేయ‌డంతో పాటు సచిన్ రికార్డును స‌మం చేసి త‌న పుట్టిన రోజును ఎంతో ప్ర‌త్యేకం చేసుకున్నాడు విరాట్ కోహ్లీ.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 119 బంతుల్లో సెంచ‌రీ చేశాడు. వ‌న్డేల్లో ఇది విరాట్ కోహ్లీ 49వ సెంచ‌రీ కావ‌డం విశేషం. ఈ క్ర‌మంలో వ‌న్డేల్లో అత్య‌ధిక శ‌త‌కాలు చేసిన స‌చిన్ రికార్డును విరాట్ స‌మం చేశాడు. 49 సెంచ‌రీలు చేసేందుకు స‌చిన్‌కు 452 ఇన్నింగ్స్‌లు అవ‌స‌రం కాగా.. విరాట్ కేవ‌లం 277 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త‌ను అందుకోవ‌డం విశేషం. మొత్తంగా ఈ మ్యాచ్‌లో కోహ్లీ 121 బంతులు ఎదుర్కొని 10 ఫోర్ల‌తో 101 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Virat Kohli : పుట్టిన రోజు నాడు హాఫ్ సెంచ‌రీలు చేసిన టీమ్ఇండియా ప్లేయ‌ర్లు ఎవ‌రో తెలుసా..?

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో విరాట్ కోహ్లీలా పుట్టిన రోజు నాడే సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు ఎవ‌రో తెలుసా..?

వినోద్ కాంబ్లీ (భార‌త్‌) 100 నాటౌట్‌ – ఇంగ్లాండ్ పై జైపూర్‌లో 1993 (21వ పుట్టినరోజు)
సచిన్ టెండూల్కర్ (భార‌త్‌) 134 – ఆస్ట్రేలియా పై షార్జాలో 1998 (25వ పుట్టినరోజు)
రాస్ టేలర్ (న్యూజిలాండ్‌) 131 నాటౌట్‌ – పాకిస్థాన్ పై పల్లెకెలెలో 2011 (27వ పుట్టినరోజు)
టామ్ లాథమ్ (న్యూజిలాండ్‌) 140 నాటౌట్ – నెద‌ర్లాండ్స్ పై హామిల్టన్ లో 2022 (30వ పుట్టినరోజు)
మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా) 121 – పాకిస్థాన్ పై బెంగళూరులో 2023 (32వ పుట్టినరోజు)
సనత్ జయసూర్య (శ్రీలంక‌) 130 – బంగ్లాదేశ్ పై కరాచీలో 2008 (39వ పుట్టినరోజు)
విరాట్ కోహ్లీ (భార‌త్‌) 101* – ద‌క్షిణాఫ్రికా పై కోల్‌క‌తాలో (35వ పుట్టిన రోజు)

NZ vs PAK : ఒక్క సెంచ‌రీతో హీరో.. రివార్డు ప్ర‌క‌టించిన పీసీబీ.. ఎంతో తెలుసా..?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 326 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ (101 నాటౌట్; 121 బంతుల్లో 10 ఫోర్లు) సెంచ‌రీ చేశాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ (77; 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కం చేశాడు. రోహిత్ శ‌ర్మ (40; 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ర‌వీంద్ర జ‌డేజా (29 నాటౌట్; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్‌, క‌గిసో ర‌బాడ‌, కేశ‌వ్ మ‌హ‌రాజ్‌, షమ్సీ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

ట్రెండింగ్ వార్తలు