Virat Kohli : ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన కోహ్లీ.. కింగ్ మొద‌లెట్టేశాడు.. ఇక బౌల‌ర్లకు కాళ‌రాత్రులే..

ఐపీఎల్ 2026 సీజ‌న్ కోసం విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రాక్టీస్ మొద‌లెట్టేశాడు.

Virat Kohli Starts for Ipl 2026 preparations video viral

  • మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం
  • ఈ సీజ‌న్ కోసం ప్రాక్టీస్ మొద‌లెట్టిన కోహ్లీ

Virat Kohli : ఐపీఎల్ 2026 సీజ‌న్ ప్రారంభానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. మార్చి 28 నుంచి ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది. అయితే.. ఈ టోర్నీకి సంబంధించిన‌ షెడ్యూల్ ఇంకా వెలువ‌డ‌న‌ప్ప‌టికి కూడా దాదాపుగా అన్ని జ‌ట్లు ప్రాక్టీస్‌ను మొద‌లెట్టాయి. ఇక టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు, ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఐపీఎల్ కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అభిమానుల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నాడు.

వీడియోలో కోహ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. భారీ షాట్లు కొడుతున్నాడు.  ఈ వీడియోకి ఐపీఎల్ 2026 అనే క్యాప్ష‌న్‌ను ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీన్ని చూసిన అభిమానులు బౌల‌ర్ల‌కు ఇక కాళ‌రాత్రులే అని కామెంట్లు చేస్తున్నారు.

Arshdeep Singh : ఫైన‌ల్ మ్యాచ్‌లో ఓవ‌రాక్ష‌న్‌.. టీమ్ ఇండియా పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్‌కు ఐసీసీ భారీ జరిమానా..

Virat Kohli : ధోని, రోహిత్ శ‌ర్మ వ‌చ్చారు స‌రే.. విరాట్ కోహ్లీ ఫైన‌ల్ మ్యాచ్‌కు ఎందుకు రాలేదు?

ఐపీఎల్ ఆరంభం (2008) నుంచి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌రుపున‌నే విరాట్ కోహ్లీ ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ విజేత‌గా నిలిచింది. ఈ క్ర‌మంలో ఎన్నాళ్లుగానో అంద‌ని ద్రాక్ష‌గా ఊరిస్తూ వ‌స్తున్న ఐపీఎల్ ట్రోఫీ సొంతం కావ‌డంతో విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురి కావ‌డం స‌గ‌టు అభిమాని అంత త్వ‌ర‌గా మ‌రిచిపోలేడు. ఇక ఐపీఎల్ 2026లోనూ ఆర్‌సీబీ విజేత‌గా నిల‌వాల‌ని కోహ్లీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.