Virat Kohli : పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో పెద్ద పొరబాటు చేసిన కోహ్లీ.. ఇలా ఎందుకు చేశావ్..!
మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఓ పొరబాటు చేశాడు. అయితే.. కాసేపటి తరువాత తన పొరబాటును గుర్తించిన కోహ్లీ దాన్ని సరిదిద్దుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- October 14, 2023 / 06:11 PM IST
Virat Kohli Wears Wrong Jersey
Virat Kohli Wears Wrong Jersey : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఓ పొరబాటు చేశాడు. కాసేపటి తరువాత తన పొరబాటును గుర్తించిన కోహ్లీ దాన్ని సరిదిద్దుకున్నాడు. అయితే.. అప్పటికే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
విరాట్ ఏం పొరబాటు చేశాడంటే..?
భారత అఫీషియల్ జెర్సీకి బదులు వేరే జెర్సీతో కోహ్లీ మైదానంలోకి వచ్చాడు. టీమ్ఇండియా ఆటగాళ్లు మొత్తం ఓ జెర్సీతో వస్తే.. కింగ్ కోహ్లీ మాత్రం వేరే జెర్సీతో వచ్చాడు. కాగా.. ఈ రెండు జెర్సీలు ఒకేలా ఉన్నప్పటికీ భుజాలపై ఉన్న స్ట్రిప్ వద్ద మూడు రంగులు తేడాగా ఉన్నాయి. అఫీషియల్ జెర్సీలో త్రివర్ణ పతాక రంగులు ఉండగా.. కోహ్లీ ధరించిన జెర్సీ స్ట్రిప్ వద్ద మూడు తెలుపు రంగు గీతలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఎవరో విరాట్ కోహ్లీ దృష్టికి తీసుకువెళ్లగా కాసేపటి తరువాత డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి అఫీషియల్ జెర్సీ వేసుకుని మైదానంలోకి వచ్చాడు.
దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
