World Cup 2023 : హ్యాట్రిక్‌ విజ‌యాల జోష్‌లో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ‌.. ఇక క‌ష్టాలు త‌ప్ప‌వా..!

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో న్యూజిలాండ్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజ‌యాలు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొనసాగుతోంది. వ‌రుస విజ‌యాల జోష్‌లో ఉన్న కివీస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.

World Cup 2023 : హ్యాట్రిక్‌ విజ‌యాల జోష్‌లో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ‌.. ఇక క‌ష్టాలు త‌ప్ప‌వా..!

Kane Williamson

ODI World Cup 2023 : భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో న్యూజిలాండ్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజ‌యాలు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొనసాగుతోంది. వ‌రుస విజ‌యాల జోష్‌లో ఉన్న కివీస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు కెప్టెన్ కేన్ విలియ‌మ్ స‌న్ ప్ర‌పంచ‌క‌ప్‌లో మిగిలిన మ్యాచులు ఆడ‌డం క‌ష్టంగా మారింది. అత‌డి చేతి వేలుకి అయిన గాయం చాలా పెద్ద‌ద‌ని కివీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.

బంగ్లాదేశ్‌తో శుక్ర‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో ప‌రుగు తీసే స‌మ‌యంలో ఫీల్డ‌ర్ విసిరిన బంతి నేరుగా కేన్ విలియ‌మ్‌ స‌న్ చేతిని తాకింది. దీంతో నొప్పితో విల‌విల‌లాడిన విలియ‌న్ స‌న్‌కు ఫిజియో వ‌చ్చి చికిత్స అందించాడు. నొప్పి తీవ్ర‌త దృష్ట్యా అత‌డు రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అత‌డి గాయానికి సంబంధించిన ఎక్స్ రే రిపోర్టు వ‌చ్చింది. అత‌డి ఎడ‌మ చేతి బొట‌న వేలికి ప్రాక్చ‌ర్ అయిన‌ట్లు అందులో తేలింది. ఈ విష‌యాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది.

ODI World Cup 2023: మీరు ఎవరి రికార్డును బద్దలు కొట్టారు..? రోహిత్ శర్మ ఏం చెప్పాడో తెలుసా?


అత‌డిని ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టు నుంచి తొల‌గించ‌డం లేద‌ని, సుదీర్ఘ టోర్న‌మెంట్‌లో ఆఖ‌రి ద‌శ‌ల్లో అత‌డు ఆడుతాడ‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేసింది. అత‌డికి ప్ర‌త్యామయ్నంగా టామ్ బ్లండెల్‌ను భార‌త్‌కు పంప‌నున్న‌ట్లు ట్వీట్ చేసింది. కేన్ లాంటి సీనియ‌ర్ ఆట‌గాడి సేవ‌ల‌ను న్యూజిలాండ్ కోల్పోవ‌డం నిజంగా ఆ జ‌ట్టుకు పెద్ద ఎదురుదెబ్బ‌గానే చెప్పవ‌చ్చు..

ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన కేన్ మామ‌..

ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో మోకాలి గాయంతో చాలా కాలం పాటు కేన్ విలియ‌మ్ స‌న్ ఆట‌కు దూరం అయ్యాడు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్ ఆడిన మొద‌టి రెండు మ్యాచుల్లో అత‌డు ఆడ‌లేదు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనే రీ ఎంట్రీ ఇచ్చి.. హాఫ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. 107 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 78 ప‌రుగులు చేసిన స‌మ‌యంలో అత‌డి చేతికి బంతి త‌గ‌ల‌డంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇలా ఒక్క మ్యాచ్ మాత్ర‌మే ఆడి మ‌ళ్లీ కేన్ మామ గాయ‌ప‌డ‌డం అత‌డికి ఫ్యాన్స్‌ను నిరాశ‌కు గురి చేస్తోంది.

Virat Kohli – Naveen Ul Haq : ఇక మేం దోస్తులం..! కలిసిపోయిన కోహ్లీ, నవీన్ ఉల్ హక్.. స్పందించిన గంభీర్.. నవీన్ వరుస ట్వీట్లు