IPL 2023: అదీ కోహ్లీ దెబ్బంటే.. కీలక మ్యాచులో ఆర్సీబీ గెలుపుపై మీమ్స్.. హైదరాబాద్ మెట్రో ట్రైన్లలోనూ..
కిక్కిరిసిపోయిన మెట్రో ట్రైన్ లోనూ ఆర్సీబీకి అనుకూలంగా ఫ్యాన్స్ నినాదాలు చేశారు.
- T Venkateshwarlu
- Updated on- May 19, 2023 / 04:21 PM IST
IPL 2023
SRH vs RCB: ప్లేఆఫ్స్ రేసులో కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించడంతో సామాజిక మాధ్యమాల్లో దీనిపై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ చేయడంతో అతడిని అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ సరసన నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఐపీఎల్ లో అతడు చేసిన మొదటి సెంచరీ ఇది. కోహ్లీ 62 బంతుల్లో సెంచరీ చేసి ఆర్సీబీ గెలుపునకు దారి చూపడంతో అతడే ఆ జట్టును ఐపీఎల్ ఫైనల్ వరకు తీసుకెళ్తాడని ఫ్యాన్స్ అంటున్నారు.
నిన్న హైదరాబాద్ లో మ్యాచ్ జరిగేముందు, ముగిసిన తర్వాత కోహ్లీ నినాదాలు వినపడ్డాయి. “అదీ కోహ్లీ దెబ్బంటే” అంటూ సామాజిక మాధ్యమాల్లోనూ కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కిక్కిరిసిపోయిన మెట్రో ట్రైన్ లోనూ ఆర్సీబీకి అనుకూలంగా ఫ్యాన్స్ నినాదాలు చేశారు. మ్యాచ్ హైదరాబాద్ లో జరిగినప్పటికీ సన్‌రైజర్స్ కన్నా ఎక్కువ ఆర్సీబీ నినాదాలే వినపడ్డాయి. హైదరాబాద్ లోని పలు వీధుల్లోనూ ఆర్సీబీ ఫ్యాన్స్ హంగామా చేశారు.
