Virat Kohli: క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన కోహ్లీ.. అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 బ్యాటర్లు వీరే..

కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్ సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

Virat Kohli: క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన కోహ్లీ.. అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 బ్యాటర్లు వీరే..

Virat Kohli

IPL 2023: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు (IPL century) బాదిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ (Chris Gayle) సరసన నిలిచాడు. మొత్తం 142 మ్యాచులు ఆడిన క్రిస్ గేల్ 6 సెంచరీలు 31 హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తం 4,965 పరుగులు అతడి ఖాతాలో ఉన్నాయి. క్రిస్ గేల్ ఓ మ్యాచులో 175 (నాటౌట్) పరుగులు చేశాడు.

నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ (RCB) బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 62 బంతుల్లో సెంచరీ చేసి ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు కోహ్లీ 236 మ్యాచులు ఆడి 6 సెంచరీలు చేశాడు. 50 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ చేసిన పరుగుల మొత్తం 7,162. అత్యధిక స్కోరు 113.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-5లో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్, కేఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్.

టాప్-5 బ్యాటర్లు
క్రిస్ గేల్: 142 మ్యాచులు ఆడిన క్రిస్ గేల్ 6 సెంచరీలు 31 హాఫ్ సెంచరీలు, మొత్తం 4,965 పరుగులు, ఓ మ్యాచులో 175 (నాటౌట్)
కోహ్లీ: 236 మ్యాచులు ఆడి 6 సెంచరీలు, 50 అర్ధ సెంచరీలు, మొత్తం 7,162 పరుగులు, అత్యధిక స్కోరు 113
జోస్ బట్లర్: 95 మ్యాచుల్లో 5 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు, మొత్తం పరుగులు 3,223… అత్యధిక స్కోరు 124
కేఎల్ రాహుల్: 118 మ్యాచులు, 4 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు, మొత్తం పరుగులు 4,163, అత్యధిక స్కోరు 132 (నాటౌట్)
డేవిడ్ వార్నర్: 175 మ్యాచులు, 4 సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలు, మొత్తం 6,311 పరుగులు, అత్యధిక స్కోరు 126

తాజాగా, కోహ్లీ చేసిన సెంచరీపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. “ఇది విరాట్ కోహ్లీ డే అనడానికి అతడు మొదటి బంతి నుంచి ఆడిన తీరే ఆధారంగా నిలిచింది. విరాట్, డు ప్లెసిస్ మ్యాచు మొత్తాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నట్లు కనపడింది. భారీ షాట్లను ఆడడమే కాదు… సక్సెస్‌ఫుల్ పార్ట్‌నర్‌షిప్ కోసం క్రీజులో అద్భుతంగా రాణించారు” అని చెప్పారు. అయితే, వారిద్దరు ఆడిన తీరుకి మ్యాచులో 186 పరుగుల లక్ష్యం చాలా తక్కువని పేర్కొన్నారు.