Virat Kohli : విరాట్ కోహ్లి సంపాద‌న ఎంతో తెలుసా..? మ‌రే క్రికెటర్‌కు కూడా సాధ్యం కాని రీతిలో

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సోష‌ల్ మీడియాలోనూ ఫాలోవ‌ర్లూ ఎక్కువే. ఇన్‌స్టాగ్రామ్‌లోనే 252 మిలియ‌న్ల‌కు పైగా ఫాలోవ‌ర్లు ఉన్నారు.

Virat Kohli

Virat Kohli Wealth: ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సోష‌ల్ మీడియాలోనూ ఫాలోవ‌ర్లూ ఎక్కువే. ఇన్‌స్టాగ్రామ్‌లోనే 252 మిలియ‌న్ల‌కు పైగా ఫాలోవ‌ర్లు ఉన్నారు. గ్రౌండ్‌లో అవ‌లీల‌గా రికార్డులు బ‌ద్ద‌లు కొట్టే కోహ్లి సంపాద‌న‌లోనూ అద‌ర‌గొట్టేస్తున్నాడు. విరాట్ కోహ్లి నిక‌ర ఆస్తుల విలువ 1000 కోట్ల‌కు పైనే ఉంటుంద‌ట‌. స్టాక్ గ్రో కంపెనీ లెక్క‌ల ప్ర‌కారం విరాట్ ఆస్తుల విలువ రూ.1050 కోట్లు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఏ ఆట‌గాడి ఆస్తుల విలువ కోహ్లికి ద‌రిదాపుల్లో లేదు.

స్టాక్ గ్రో కంపెనీ లెక్క‌ల ప్ర‌కారం..

– టీమ్ఇండియాలో ప్ర‌స్తుతం విరాట్ స్టార్ ఆట‌గాడు. అత‌డికి బీసీసీఐ ఏ ప్ల‌స్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఏడాదికి రూ.7 కోట్ల‌ను బీసీసీఐ అత‌డికి చెల్లిస్తుంది. ఇక మ్యాచ్ ఫీజుల ద్వారా ప్ర‌తి టెస్టు మ్యాచ్‌కు రూ.15ల‌క్ష‌లు, వ‌న్డేల‌కు రూ.6ల‌క్ష‌లు, టీ20కి రూ.3ల‌క్ష‌లు అందుకుంటాడు.

– ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో కోహ్లి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఆర్‌సీబీ అత‌డికి ఏడాదికి రూ.15కోట్లు చెల్లిస్తుంది.

– ఒక్కో యాడ్‌లో న‌టించేందుకు విరాట్ రూ.7.50 కోట్ల నుంచి రూ.10 కోట్లు తీసుకుంటాడు. దాదాపు 18 బ్రాండ్ల‌కు అత‌డు ప్ర‌చార‌క‌ర్త‌గా ఉన్నాడు. వీటి ద్వారా రూ.175 కోట్లు సంపాదిస్తున్నాడు.

– సోష‌ల్ మీడియాలో అత్య‌ధిక ఫ్యాన్ ఫాలోయింగ్ క‌లిగిన కోహ్లి దీని ద్వారా బాగానే సంపాదిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేసినందుకు రూ.8.9 కోట్లు, ట్విట్ట‌ర్‌లో ఒక్కో పోస్టుకు రూ.2.5కోట్లు తీసుకుంటాడు.

– బ్లూట్రైబ్‌, యూనివర్సల్‌ స్పోర్ట్స్‌బిజ్‌, ఎంపీఎల్‌, స్పోర్ట్స్‌ కాన్వో లాంటి స్టార్టప్స్‌లో కోహ్లి పెట్టుబ‌డులు పెట్టాడు. పుల్‌బాల్ క్ల‌బ్‌, టెన్నిస్ టీమ్‌, ప్రో రెజ్లింగ్ లీగుల్లో భాగ‌స్వామిగా ఉన్నాడు. ముంబైలో రెండు రెస్టారెంట్స్ ఉన్నాయి.

– ముంబైలో రూ.34 కోట్లు విలువ చేసే ఇళ్లు ఉండ‌గా, గుర్‌గ్రామ్‌లో రూ.80 కోట్లు విలువ చేసే విల్లా ఉంది. అంతేకాకుండా రూ.31కోట్ల విలువైన కార్లు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు