IND vs WI : గిల్‌, య‌శ‌స్విల భాగ‌స్వామ్యం పై వ‌సీం జాఫ‌ర్ హిలేరియ‌స్ వీడియో.. ఓ సారి చూసేయండి..?

శ‌నివారం వెస్టిండీస్‌తో జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా దుమ్ములేపింది. అన్ని విభాగాల్లో ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ 9 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

Jaiswal Shubman Gill partnership

IND vs WI 4th T20 : శ‌నివారం వెస్టిండీస్‌తో జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా (Team India) దుమ్ములేపింది. అన్ని విభాగాల్లో ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ 9 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 178 ప‌రుగులు చేయ‌గా ల‌క్ష్యాన్ని భార‌త్ 17 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. టీమ్ఇండియా విజ‌యంలో ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్‌(77; 47 బంతుల్లో 3ఫోర్లు, 5 సిక్స‌ర్లు) య‌శ‌స్వి జైశ్వాల్ (84 నాటౌట్; 51 బంతుల్లో 11 ఫోర్లు, 3సిక్స‌ర్లు) లు కీల‌క పాత్ర పోషించారు.

తొలి వికెట్‌కు 165 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పి ఛేద‌న‌ను చాలా తేలిక‌గా చేశారు. వీరిద్ద‌రు చ‌క్క‌గా స్ట్రైకింగ్‌ రొటేట్ చేసుకుంటూ ఒక‌రు హిట్టింగ్ మొద‌లు పెట్ట‌గానే మ‌రొక‌రు యాంక‌ర్ రోల్ పోషిస్తూ జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చారు. గిల్‌- య‌శ‌స్వి ల స‌మ‌న్వ‌య భాగ‌స్వామ్యాన్ని మాజీ క్రికెట‌ర్ వ‌సీం జాఫ‌ర్ సోష‌ల్ మీడియాలో ఓ వీడియో ద్వారా తెలియ‌జేశాడు. ఈ వీడియోలో ఓ వ్య‌క్తి మూడు వస్తువులు ఒక‌దాని త‌రువాత ఒక‌టి వ‌రుస‌గా మూడింటిని గాల్లోకి ఎగ‌ర‌వేస్తుండ‌గా మ‌రో వ్య‌క్తి వ‌చ్చి అవి కింద‌ప‌డ‌కుండా బ్యాలెన్స్ చేస్తూ ఎగుర‌వేశాడు. ఇలా ఇద్ద‌రు మార్చి మార్చి చేశారు.

Rohit Sharma: కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా కెప్టెన్.. ఫొటోలు, వీడియో వైరల్

‘వెల్‌డ‌న్ టీమ్ఇండియా. శుభ్‌మ‌న్‌, జైస్వాల్ ఇద్ద‌రూ ఇలా ఆడారు. మ‌రోసారి కుల్దీప్ కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టారు.’ అంటూ వీడియోను పంచుకున్నాడు వ‌సీం జాఫ‌ర్‌.

మ్యాచ్ అనంత‌రం య‌శ‌స్వి జైస్వాల్ మాట్లాడుతూ.. త‌న రెండో టీ20 మ్యాచులోనే హాఫ్ సెంచ‌రీ సాధించ‌డం చాలా ఆనంద‌నంగా ఉంద‌ని చెప్పారు. ఇది కేవ‌లం ఆరంభం మాత్ర‌మేన‌ని, ఈ రోజు జ‌ర‌గ‌నున్న ఐదో టీ20 మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పాడు. మంచి ఆరంభం దొరికితే దానిని స‌ద్వినియోగం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని అన్నాడు. టీమ్ఇండియా త‌రుపున ఆడ‌డం త‌న జీవితంలో చాలా ప్ర‌త్యేక‌మ‌న్నాడు. ఇందుకోసం చాలా శ్ర‌మించిన‌ట్లు తెలిపాడు.

IND vs WI 4th T20 : దంచికొట్టిన భార‌త ఓపెన‌ర్లు.. నాలుగో టీ20లో టీమ్ఇండియా ఘ‌న‌ విజ‌యం.. సిరీస్ స‌మం

ట్రెండింగ్ వార్తలు