Flash Flood : ఇదేందిదీ.. వ‌ర్షం లేదు.. అయినా పిచ్ పై వ‌ర‌ద‌.. వీడియో వైర‌ల్‌

సాధార‌ణంగా వ‌ర్షం కార‌ణంగా పిచ్‌లు త‌డిగా మార‌డంతో మ్యాచులు ఆల‌స్యంగా ప్రారంభం కావ‌డం లేదంటే పూర్తిగా ర‌ద్దు కావ‌డం చూస్తూంటాం.

Flash Flood

Flash Flood : సాధార‌ణంగా వ‌ర్షం కార‌ణంగా పిచ్‌లు త‌డిగా మార‌డంతో మ్యాచులు ఆల‌స్యంగా ప్రారంభం అవుతాయి. లేదంటే.. పూర్తిగా ర‌ద్దు కావ‌డం చూస్తూంటాం. అయితే.. వ‌ర్షం ప‌డ‌కుండానే త‌డిగా మార‌డం కాదు.. పిచ్ పై ఏకంగా వ‌ర‌ద పారింది. ఓ బ్యాట‌ర్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసే ఓ ప్లేయ‌ర్ ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గొన్నాడు. బౌల‌ర్ లెగ్ స్టంప్ పై బంతి వేయ‌గా స‌ద‌రు బ్యాట‌ర్ ఫైన్ లెగ్ ప్రాంతం వైపు ప్లిక్ షాట్ ఆడాడు. ఆ బంతి చాలా బలంగా అక్క‌డే ఉన్న ప్లాస్టిక్ ట్యాంక్ దిగువ భాగాన్ని తాకింది. దీంతో ఆ ట్యాంకు ప‌గిలిపోయింది. అందులోని నీళ్లు వ‌ర‌ద‌లా ప్రాక్టీస్ చేస్తున్న పిచ్ పై ప్ర‌వ‌హించాయి.

దీన్ని చూసిన స‌ద‌రు బ్యాట‌ర్ అవాక్కైయ్యాడు. ఇది ఎప్పుడు ఎక్క‌డ జ‌రిగింది అన్న విష‌యాలు తెలియ‌రాలేదు. ఈ వీడియో వైర‌ల్‌గా మారగా నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు హెయిర్ డ్రైయ‌ర్స్ అవ‌స‌రం అని ఒక‌రు అన‌గా పిచ్ పై ఆక‌స్మాతుగా వ‌ర‌ద‌లు అంటూ మ‌రొక‌రు అన్నారు.

Rishabh Pant : రిష‌బ్‌ పంత్ ఇంట త్వ‌ర‌లో మోగ‌నున్న పెళ్లి బాజాలు.. 9 ఏళ్ల నుంచి ల‌వ్‌..

ఇక టీమ్ఇండియా విష‌యానికి వ‌స్తే.. ద‌క్షిణిఫ్రికాతో టెస్టు సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న ముగియ‌డంతో ప్ర‌స్తుతం ఆట‌గాళ్లు స్వ‌దేశానికి చేరుకుంటున్నారు. నిన్న కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రాగా.. నేడు విరాట్ కోహ్లీ వ‌చ్చాడు. జ‌న‌వ‌రి 11 నుంచి అఫ్గానిస్తాన్‌తో భార‌త జ‌ట్టు 3 మ్యాచుల టీ20 సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్ కోసం ఇప్ప‌టికే అఫ్గాన్ జ‌ట్టు 19 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించ‌గా టీమ్ఇండియా ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ట్టును ప్ర‌క‌టించ‌లేదు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022 సెమీ ఫైన‌ల్ మ్యాచ్ త‌రువాత నుంచి స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు టీమ్ఇండియా త‌రుపున మ‌రో టీ20 మ్యాచ్ ఆడ‌లేదు. అయితే.. అఫ్గాన్‌తో సిరీస్‌తో పాటు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో వీరిద్ద‌రు ఆడ‌నున్నార‌ని వార్త‌లు వస్తున్నాయి. ఈ విష‌య‌మై వీరిద్ద‌రితో చ‌ర్చించిన త‌రువాతే అఫ్గాన్ తో టీ20 సిరీస్‌కు జ‌ట్టును ఎంపిక చేయ‌నున్నారు. అందుక‌నే జ‌ట్టును ప్ర‌క‌టించ‌డంలో ఆల‌స్యం అవుతుంద‌ని అంటున్నారు.

భారత్ vs అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..

* జ‌న‌వ‌రి 11న తొలి టీ20 – మొహాలి
* జ‌న‌వ‌రి 14న రెండ‌వ టీ20 – ఇండోర్‌
* జ‌న‌వ‌రి 17న మూడో టీ20 – బెంగ‌ళూరు
Kieron Pollard : ముంబై కెప్టెన్సీ వివాదం.. రోహిత్‌కు మ‌ద్ద‌తుగా పొలార్డ్‌..! అవ‌స‌రం తీర‌గానే..

ట్రెండింగ్ వార్తలు