IPL Loan : ఆర్‌సీబీ ఆట‌గాడిని సీఎస్‌కే అద్దెకు తీసుకోవ‌చ్చా? ఐపీఎల్ లోన్ అంటే ఏమిటి? నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయంటే?

సీజ‌న్ మ‌ధ్య‌లో ఒక ఫ్రాంచైజీ మరో ఫ్రాంచైజీ నుండి ఆటగాడిని అద్దెకు (లోన్‌) తీసుకోవచ్చు. అంటే వారిని స‌ద‌రు ఫ్రాంచైజీ కొనుగోలు చేయ‌దు. కేవ‌లం అద్దెకు (IPL Loan) మాత్ర‌మే తీసుకుంటుంది. అలాగే ఆ సీజ‌న్‌లో స‌ద‌రు ఆట‌గాడిగాతో ఎలాంటి ఒప్పందం చేసుకోదు.

What Is IPL Loan Rule A RCB Player can play for csk in same season (pic credit@ipl)

  • ఆర్‌సీబీ ఆట‌గాడిని లోన్ (అద్దెకు) పై తీసుకోవాల‌ని సీఎస్‌కేకు అశ్విన్ సూచ‌న‌
  • 2018 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన ఐపీఎల్ లోన్ నిబంధ‌న‌
  • ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఫ్రాంఛైజీ కూడా దీన్ని ఉప‌యోగించుకోలేదు

IPL Loan : ఐపీఎల్ 2026లో దాదాపుగా ప్ర‌తి ఫ్రాంఛైజీ గాయాల స‌మ‌స్య‌లను ఎదుర్కొంటున్నాయి. ఇందులో చెన్నై సూప‌ర్ కింగ్స్ కూడా ఉంది. ఎంఎస్ ధోని గాయంతో ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. ఇక తాజాగా సూప‌ర్ ఫామ్‌లో ఉన్న యువ ఆట‌గాడు ఆయుష్ మాత్రే గాయంతో ఈ సీజ‌న్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌కు దూరం అయ్యాడు. ఈ నేప‌థ్యంలో టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ సీఎస్‌కే జ‌ట్టుకు ఓ ఆస‌క్తిక‌రమైన సూచ‌న చేశాడు.

ఆర్‌సీబీ జ‌ట్టు నుంచి అండ‌ర్‌-19 స్టార్ ఆట‌గాడు విహాన్ మ‌ల్హోత్రాను ఈ సీజ‌న్‌లో మిగిలిన కాలానికి లోన్‌పై తీసుకోవాల‌ని సూచించాడు. దీని వ‌ల్ల సీఎస్‌కేతో పాటు స‌దరు యువ ఆట‌గాడికి ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంద‌న్నాడు. అత‌డిని వ‌ద్దనుకుంటే క‌నీసం అభిజ్ఞాన్ కుందు అయిన లోన్‌పై తీసుకోవాల‌ని సూచించాడు. ప్ర‌స్తుతం అశ్విన్ వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఐపీఎల్ లోన్ విధానం అంటే ఏమిటి? అనే దాని గురించే తెలుసుకునేందుకు ఆస‌క్తి ఏర్ప‌డింది.

Krunal Pandya : హార్దిక్ పాండ్యాతో గొడ‌వ‌లు.. స్పందించిన కృనాల్ పాండ్యా.. నేను అస‌లు..

సాధార‌ణంగా టోర్నమెంట్ సమయంలో ఒక ఆటగాడు గాయపడి జట్టుకు దూరమైనప్పుడు ఐపీఎల్ నిబంధ‌న‌ల ప్ర‌కారం కొన్ని ష‌ర‌తుల‌కు లోబ‌డి ఫ్రాంఛైజీలు ప్ర‌త్యామ్నాయ ఆట‌గాళ్ల‌ను తీసుకుంటుంటాయన్న సంగ‌తి తెలిసిందే. ఇలా కాకుండా సీజ‌న్ మ‌ధ్య‌లో ఒక ఫ్రాంచైజీ మరో ఫ్రాంచైజీ నుండి ఆటగాడిని అద్దెకు (లోన్‌) తీసుకోవచ్చు. అంటే వారిని స‌ద‌రు ఫ్రాంచైజీ కొనుగోలు చేయ‌దు. కేవ‌లం అద్దెకు మాత్ర‌మే తీసుకుంటుంది. అలాగే ఆ సీజ‌న్‌లో స‌ద‌రు ఆట‌గాడిగాతో ఎలాంటి ఒప్పందం చేసుకోదు.

ఐపీఎల్ లోన్ (అద్దె) నిబంధ‌న‌లు ఇవే..

* ఐపీఎల్‌లో లోన్ విండో సాధార‌ణంగా సీజ‌న్‌లోని 20వ‌ మ్యాచ్ నుంచి 34 వ మ్యాచ్ మ‌ధ్య లేదా ఫ్రాంఛైజీ 7వ మ్యాచ్ త‌రువాత మూసివేయ‌బ‌డుతుంది.
* గరిష్టంగా రెండు మ్యాచ్‌లలో ఆడిన ఆటగాళ్లు మాత్రమే లోన్‌పై వెళ్లడానికి అర్హులు.
* ఒక సీజన్‌లో ఒక ఆటగాడు ఒకేసారి లోన్‌పై వెళ్లగలడు. అలాగే.. లోన్‌పై వెళ్లిన ఆటగాడు, తనను లోన్‌పై పంపిన ఫ్రాంచైజీకి వ్యతిరేకంగా ఆడకూడదు.

సీజన్ మధ్యలో గాయపడటం లేదా పేలవమైన ఫామ్‌లో ఉండటం వంటి సందర్భాలలో లోన్ విధానాన్ని ఉపయోగించుకోవడానికి ఇది ఫ్రాంచైజీలకు వీలు కల్పిస్తుంది.

SRH vs DC : కేఎల్ రాహుల్‌, నితీష్ రాణాల‌ను బ‌లిప‌శువుల‌ను చేశారుగా.. ఓట‌మికి గ‌ల కారణాలు వెల్ల‌డించిన ఢిల్లీ క్రికెట్ డైరెక్ట‌ర్‌..

గత ఎనిమిది సీజన్లలో ఏ ఫ్రాంచైజీ కూడా ఈ విధానాన్ని ఉపయోగించలేదు, ఎందుకంటే చాలా జట్లు గాయపడిన ఆటగాళ్ల స్థానంలో కొత్తవారిని తీసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. 2018లో ఐపీఎల్ సీజన్‌లో ఫ్రాంచైజీలు కేవలం అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను మాత్రమే లోన్ వెళ్లేందుకు అనుమ‌తి ఉండేది. కానీ ఒక సంవ‌త్స‌రం త‌రువాత క్యాప్డ్ ఆట‌గాళ్ల‌ను కూడా లోన్ పై వెళ్లేందుకు అనుమ‌తి ఇస్తూ నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించారు.