Krunal Pandya : హార్దిక్ పాండ్యాతో గొడవలు.. స్పందించిన కృనాల్ పాండ్యా.. నేను అసలు..
హార్దిక్ పాండ్యాతో తనకు గొడవలు అని వస్తున్న వార్తలపై కృనాల్ పాండ్యా (Krunal Pandya ) స్పందించాడు.
Krunal Pandya Response on Rumours Of Rift With Brother Hardik
- కృనాల్, హార్దిక్‌ల మధ్య గొడవలు అంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది
- ఎట్టకేలకు ఈ విషయంపై స్పందించిన కృనాల్
- మిస్టర్ నాగ్‌తో ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్లు
Krunal Pandya : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాకు, అతని సోదరుడు, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మధ్య సంబంధాలు సరిగ్గా లేవు అనే వార్తలు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల ఐపీఎల్ 2026లో ఆర్సీబీ, ముంబై జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఔట్ అయిన అనంతరం కృనాల్ పెద్ద ఎత్తు సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో కృనాల్‌ను కాస్త సీరియస్‌గానే చూస్తూ హార్దిక్ పెవిలియన్‌కు నడుచుకుంటూ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయనే వాదనకు ఇదే సాక్ష్యం అని కొందరు అన్నారు.
MS Dhoni : ధోని వికెట్ కీపింగ్ చేసేటప్పుడు బ్యాటర్లు గుర్తుంచుకోవాల్సిన రెండు విషయాలు ఇవే..
తాజాగా హార్దిక్ పాండ్యాతో గొడవల పై కృనాల్ పాండ్యా స్పందించాడు. మిస్టర్ నాగ్స్‌తో ఇంటర్వ్యూలో కృనాల్ ఈ విషయం పై మాట్లాడాడు. అవన్నీ రూమర్లేని కొట్టి పారేశాడు. సోషల్ మీడియాలో మీ అన్నదమ్ముల గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. మీ ఇద్దరి మధ్య గొడవలు ఏమన్నా జరిగాయా? అని నాగ్ ప్రశ్నించగా.. కృనాల్ గట్టిగా నవ్వేశాడు. అంతా సవ్యంగానే ఉందన్నాడు.
Bhaivalry was at it’s peak, emotions running high 🔥#MIvRCB | [Mumbai Indians, Rohit, Kohli, Tilak, Rajat Patidar] pic.twitter.com/CTEtAgcNiB
— Star Sports (@StarSportsIndia) April 12, 2026
ఇక లక్నో సూపర్ జెయింట్స్ యువ ఆటగాడు ముకుల్ చౌదరిని తాను స్లెడ్జింగ్ చేశానన్న ఆరోపణలపై కృనాల్ స్పందించాడు. యువ ఆటగాడిని తాను స్లెడ్జ్ చేశానని బయట అనుకుంటున్నారు. వాస్తవానికి నేను అతడికి బౌలింగ్ చేశాడు. తొలి బంతి అతడి ప్యాడ్లకు తాకింది. దీంతో నేను ఔట్ కోసం అప్పీల్ చేశాను. అదే సమయంలో అతడితో మాట్లాడుతూ.. నువ్వు యువకుడివి సిక్సర్లు కొట్టగలవు, లాంగ్ ఆన్ లేదా లాంగ్ ఆఫ్ మీదుగా సిక్సర్లు కొట్టు.. అని అన్నాను. అతడు కూడా నవ్వేశాడు. అది ఒక జోక్ మాత్రమే. అయితే.. నేను సీరియస్‌గా ఉండడం చూసి జనాలు నాకు కోపం ఎక్కువ అని అనుకుంటారు అని కృనాల్ తెలిపాడు.
𝗔𝘂𝗿𝗮 + 𝗩𝗶𝗯𝗲𝘀: 𝗞𝗿𝘂𝗻𝗮𝗹 𝗣𝗮𝗻𝗱𝘆𝗮 🤝 𝗠𝗿. 𝗡𝗮𝗴𝘀 😂🥶✌️
Krunal’s hairstyles, business ventures, on field tactics & antics, and some personal life secrets – Mr. Nags bowls bouncers to Krunal Pandya on this latest episode of @bigbasket_com presents RCB Insider.… pic.twitter.com/iI4U3KofMI
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 22, 2026
