MS Dhoni : ధోని వికెట్ కీపింగ్ చేసేటప్పుడు బ్యాటర్లు గుర్తుంచుకోవాల్సిన రెండు విషయాలు ఇవే..
ముంబైతో మ్యాచ్‌లో ఎంఎస్ ధోని (MS Dhoni) ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.
When MS Dhoni behind the stumps these two rules must remember for batters
- మంగళవారం వాంఖడే మైదానంలో వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేసిన ధోని
- వీడియో పోస్ట్ చేసిన సీఎస్కే
- ధోని వికెట్ల వెనుక ఉన్నప్పుడు బ్యాటర్లు రెండు విషయాలు గుర్తుంచుకోవాలని సూచన
MS Dhoni : ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం (ఏప్రిల్ 22) ముంబైలోని వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు ఓ శుభవార్త అందుతోంది. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.
44 ఏళ్ల ధోని ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ధోని గాయపడ్డాడని కోలుకునేందుకు రెండు వారాల సమయం పడుతుందని సీఎస్కే తెలిపింది. అయితే.. రెండు వారాలు గడిచినప్పటికి కూడా ధోని మైదానంలో అడుగుపెట్టలేదు. అయితే.. ప్రస్తుతం అతడు గాయం నుంచి కోలుకున్నట్లుగా కనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ధోని వికెట్ కీపింగ్ చేస్తూ కనిపించాడు.
Radha Yadav : సముద్రంలో జలకాలాడుతున్న భారత మహిళా క్రికెటర్ రాధా యాదవ్
ఈ వీడియోలో ధోని వికెట్ కీపింగ్ చేస్తుండగా.. బ్యాటర్ క్రీజు దాటి ముందుకు వెళ్లాడు. వెంటనే ధోని బాల్ అందుకుని స్టంపింగ్ చేశాడు. దీనిపై సీఎస్కే సరదాగా కామెంట్లు చేసింది. ధోని వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు రెండు విషయాలు గుర్తుంచుకోవాలని అంది. మొదటిది ధోని కీపింగ్ చేసేటప్పుడు బ్యాటర్ క్రీజు దాటి ముందుకు వెళ్లకూడదు. ఇక రెండోది మొదటి రూల్‌ను మరోసారి చదువు అని రాసుకొచ్చింది.
ఇదిలా ఉంటే.. గురువారం వాంఖడే మైదానంలో ధోని సుమారు 40 నిమిషాల పాటు వికెట్ కీపింగ్ చేశాడు. ఆ తరువాత నెట్స్‌లో దాదాపు గంటసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. గాయం తరువాత ధోని వికెట్ కీపింగ్ చేయడం ఇదే తొలిసారి కావడంతో ముంబైతో మ్యాచ్‌లో ఆడతాడని వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా ధోని ముంబైతో మ్యాచ్‌లో ఆడతాడో లేదో మరి.
ఇదిలా ఉంటే.. ఆయుష్ మాత్రే గాయంతో మిగిలిన సీజన్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో ఉర్విల్ పటేల్ ఆడే అవకాశం లభించవచ్చు. అదే సమయంలో బ్యాటింగ్ ఆర్డర్లో సర్ఫరాజ్ ఖాన్ కు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
Rule No. 1: Don’t step out when Thala’s behind the stumps
Rule No. 2: Read Rule No. 1 again 😂💪#WhistlePodu #Yellove pic.twitter.com/mPYUIb3yuW— Chennai Super Kings (@ChennaiIPL) April 21, 2026
ఈ సీజన్లో సీఎస్కే ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేటు -0.780గా ఉంది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. ధోని వచ్చి సీఎస్కే రాత మారుస్తాడో లేదో చూడాలి.
