Jake Fraser McGurk : కృనాల్ పాండ్య బౌలింగ్‌లో మూడు సిక్స‌ర్లు బాదిన‌ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఎవరు?

ఐపీఎల్ అరంగ్రేటంలో ఆస్ట్రేలియా యువ బ్యాట‌ర్ జేక్ ప్రేజ‌ర్‌-మెక్‌గుర్క్ అద‌ర‌గొట్టాడు.

pic credit @DC twitter

Australian batter Jake Fraser-McGurk : ఐపీఎల్ అరంగ్రేటంలో ఆస్ట్రేలియా యువ బ్యాట‌ర్ జేక్ ప్రేజ‌ర్‌-మెక్‌గుర్క్ అద‌ర‌గొట్టాడు. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అత‌డు శుక్ర‌వారం ఏకానా స్టేడియంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్ ద్వారా అరంగ్రేటం చేశాడు. ఈ మ్యాచ్‌లో అత‌డు ల‌క్నో బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతినే సిక్స‌ర్‌గా మ‌లిచాడు. య‌శ్ ఠాకూర్ బౌలింగ్‌లో డీప్ మికెట్ మీదుగా బంతిని సిక్స్ బాదాడు.

ఇక కృనాల్ పాండ్య కు అయితే చుక్క‌లు చూపించాడు. అత‌డి బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్స‌ర్లు బాదాడు. మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న అత‌డు 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు బాది 55 ప‌రుగులు చేశాడు.

Rishabh Pant : రిష‌బ్ పంత్ అరుదైన ఘ‌న‌త‌.. గిల్‌, కోహ్లిల త‌రువాత ఒకే ఒక్క‌డు..

జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఎవరంటే?

ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో 2002 ఏప్రిల్ 11న జ‌న్మించాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్. 2019లో ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. విక్టోరియాకు ప్రాతినిధ్యం వ‌హించాడు. అదే ఏడాది లిస్ట్ ఏ క్రికెట్‌లోనూ ఎంట్రీ ఇచ్చాడు. లిస్ట్ ఏ క్రికెట్ దుమ్ములేపాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 29 బంతుల్లో సెంచ‌రీ చేసి.. అత్యంత వేగ‌వంత‌మైన సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. దీంతో అత‌డికి బిగ్‌బాష్ లీగ్ లో ఆడే అవ‌కాశం వ‌చ్చింది.

బిగ్‌బాష్‌ లీగ్ 2020 సీజన్‌లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు. త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 37 టీ20 మ్యాచ్‌లు ఆడిన అత‌డు 645 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 550 పరుగులు, లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 525 పరుగులు పేరిట ఉన్నాయి. అంత‌ర్జాతీయ క్రికెట్‌లోనూ అడుగుపెట్టాడు.

Hardik Pandya : హార్దిక్ పాండ్య గాయ‌ప‌డ్డాడు.. దాన్ని అత‌డు ఒప్పుకోవ‌డం లేదు : కివీస్ మాజీ పేస‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఐపీఎల్ 2024 సీజ‌న్ కోసం నిర్వహించిన వేలంలో రూ.50ల‌క్ష‌ల బేస్‌ప్రైజ్‌తో త‌న పేరును న‌మోదు చేసుకున్నాడు. అయితే అత‌డిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయ‌లేదు. ఇంగ్లాండ్ ఆట‌గాడు హ్యారీ బ్రూక్ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఈ సీజ‌న్ నుంచి త‌ప్పుకోవ‌డంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ అత‌డిని రూ.50ల‌క్ష‌ల‌కే సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లోనే అత‌డు జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు.

ట్రెండింగ్ వార్తలు