Salil Arora : సన్‌రైజర్స్ కొత్త తుఫాను.. ఎవరీ సలీల్ అరోరా?
సన్ రైజర్స్ నయా సంచలనం సలీల్ అరోరా (Salil Arora) ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరిలో వేగంగా ఆడి హైదరాబాద్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- April 30, 2026 / 12:31 PM IST
who is Salil Arora Sunrisers Hyderabad new batting sensation (pic credit@ipl)
- ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్
- ఆఖరిలో వేగంగా ఆడిన సన్‌రైజర్స్ ఆటగాడు సలీల్ అరోరా
- 10 బంతుల్లో 30 నాటౌట్
Salil Arora : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాలతో దూసుకుపోతుంది. బుధవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 244 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ నయా సంచలనం సలీల్ అరోరా ఆఖరిలో వేగంగా ఆడి హైదరాబాద్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
నితీశ్ కుమార్ రెడ్డి ఔటైన తరువాత క్రీజులోకి వచ్చిన ఈ ఆటగాడు విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కేవలం 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అతడు కొట్టిన సిక్సర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది.
ఎవరీ సలీల్ అరోరా ?
పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన సలీల్ అరోరా 2002 నవంబర్ 7న జన్మించాడు. అతడి తండ్రి రాకేష్ అరోరాకు ఓ చిన్న వ్యాపారం ఉంది. ఆయన కూడా ఓ మాజీ క్రికెటర్. ఆయన జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడారు. అయితే.. కుటుంబ బాధ్యతల కారణంగా ఆయన మధ్యలోనే క్రికెట్‌ను వదిలి వ్యాపారంలోకి ప్రవేశించారు. అయినప్పటికీ ఆయనలోని క్రికెటర్ మాత్రం సజీవంగానే ఉన్నారు. అందుకే.. సలీల్ పుట్టినప్పుడు, తన కొడుకును ఒక క్రికెటర్‌గా చేయాలని నిర్ణయించుకున్నాడు.
𝙉𝙊 𝙇𝙊𝙊𝙆. 𝙉𝙊 𝙁𝙀𝘼𝙍 🔥
Shot of extreme confidence from Salil Arora 🫡
Updates ▶️ https://t.co/ypWTkEr2Rc#TATAIPL | #KhelBindaas | #MIvSRH pic.twitter.com/hC8aoPTvCm
— IndianPremierLeague (@IPL) April 29, 2026
23 ఏళ్ల సలీల్ తన తండ్రి కలను నెరవేరుస్తున్నాడు. గత సంవత్సరం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించడంతో సలీల్ తొలిసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో సలీల్ 45 బంతుల్లో 11 సిక్సర్లు, 9 ఫోర్లతో సహా 125 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2026లో సలీల్ ను 30 లక్షల కనీస ధరతో వేలంలోకి రాగా చివరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ1.50 కోట్లకు కొనుగోలు చేసింది.
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి భీకర హిట్టర్లు ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో అతడు పేరు తెచ్చుకోవడం సామాన్యమైన విషయం కాదు.
