Yashasvi Jaiswal batting
లంచ్ బ్రేక్.. టీమ్ ఇండియా స్కోరు 400/4
మూడో రోజు ఆటలో తొలి సెషన్ ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ నాలుగు వికెట్లు నష్టపోయి 400 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(72), రవీంద్ర జడేజా(21) ఉన్నారు.
కోహ్లి అర్థశతకం
సాధికారకంగా ఆడుతున్న విరాట్ కోహ్లి అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. వారికన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 147 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. విరాట్ టెస్టు కెరీర్‌లో ఇది 29వ అర్థ శతకం
రహానే విఫలం..
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అదరగొట్టిన సీనియర్ ఆటగాడు అజింక్యా రహానె మొదటి ఇన్నింగ్స్‌లో విఫలం అయ్యాడు. కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి కీమర్ రోచ్ బౌలింగ్‌లో బ్లాక్ వుడ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్ 356 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
రికార్డు మిస్.. పెవిలియన్‌కు చేరుకున్న జైశ్వాల్
అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్ అందుకోవడంతో అరంగ్రేట వీరుడు యశస్వి జైశ్వాల్(171) ఇన్నింగ్స్‌ను తెరపడింది. మరో 17 పరుగులు చేసి ఉంటే టీమ్ఇండియా తరుపున డెబ్యూలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచేవాడు. తృటిలో ఆ రికార్డును మిస్ అయ్యాడు. 350 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది.
జైశ్వాల్@150
డెబ్యూ టెస్టులో జైశ్వాల్ జోరు కొనసాగిస్తున్నారు. ఓపెనర్‌గా వచ్చిన జైశ్వాల్ మూడో రోజు జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 360 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య డొమినిక వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో ఆట ప్రారంభమైంది. భారత్ ఓవర్ నైట్ స్కోరు 312/2 బ్యాటింగ్‌ను కొనసాగిస్తోంది. క్రీజులో యశస్వి జైస్వాల్ (143), విరాట్ కోహ్లి(36) ఉన్నారు. వెస్టిండీస్‌పై ప్రస్తుతం టీమ్ఇండియా 162 పరుగుల ఆధిక్యంలో ఉంది.