క్రికెట్ బోర్డు చీఫ్ జట్టులోని ఆల్ రౌండర్‌పై ఆగ్రహంతో జెర్సీ నెంబర్ లేకుండా చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. మరి కొద్ది రోజుల్లో భారత్‌లో పర్యటించనున్న బంగ్లాదేశ్ జీతాలు పెంచాలంటూ సమ్మెకు దిగింది. దీనిని పరిష్కరించేందుకు క్రికెట్ బోర్డు చీఫ్ నజ్ముల్ హస్సన్ ప్లేయర్లతో సమావేశమయ్యాడు.
‘మీరజ్, నేను మీ కోసం ఏం చేయలేదు. నా ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయడం లేదు. ఇవాల్టి నుంచి నా ఫోన్ నుంచి నీ నెంబర్ డిలీట్ చేస్తా’ నని ఆగ్రహం వ్యక్తం చేశాడు. శుక్రవారం జరిగిన మీటింగ్‌తో సమ్మె ముగిసింది. టీ20 కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మాట్లాడుతూ.. చర్చలు సజావుగా జరిగాయని తెలిపాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్, డైరక్టర్లు డిమాండ్లు విన్నారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని మాటిచ్చారన్నారు.
భారత్‌లో జరగాల్సి ఉన్న సుదీర్ఘ పర్యటనకు ముందు సమ్మెకు దిగడంతో పర్యటనపై నెలకొన్న సందిగ్ధత వీడింది. ఈ సమ్మె విరమణతో నవంబరు 3న జరిగే తొలి టీ20 మ్యాచ్‌కు మార్గం సుగమమైంది. ముందుగా జరిగే టీ20సిరీస్ కు విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటుండగా, జట్టును రోహిత్ శర్మ కెప్టెన్‌గా నడిపించనున్నాడు.