Team India
Team India: శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు జులైలో పర్యటనకు వెళ్లనుంది టీమిండియా. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కన్ఫామ్ చేశారు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగే సిరీస్‌లోనే విరాట్ కోహ్లీ కెప్టెన్ గా బాధత్యలు తిరిగి అందుకుంటాడు. జూన్‌లో యునైటెడ్ కింగ్ డమ్‌లో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులు ఆడనుంది టీమిండియా.
జులైలో టెస్టు సిరీస్ ఆడేలా ప్లాన్ చేశాం. ఇంకా టీ20, వన్డేలను శ్రీలంకలో ఆడతారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు శ్రీలంకకు వెళ్లే జట్టుకు కొత్త కెప్టెన్ ఉంటారు. విరాట్ కోహ్లీ, అజింకా రహానె, చతేశ్వర్ పూజారా, రవిచంద్రన్ అశ్విన్ లాంటి వాళ్లు కాకుండా 3 కొత్త ఆప్షన్ల కోసం చూస్తున్నాం.
శిఖర్ ధావన్: ఆసియా కప్ 2018 ఎడిషన్ లో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నప్పుడు ధావన్ వైస్ కెప్టెన్ బాధ్యతలు పోషించాడు. ఇప్పుడు ఐపీఎల్ 14వ సీజన్ కూడా వాయిదాపడటంతో రెస్ట్ దొరికినట్లు అవుతుంది కాబట్టి కెప్టెన్ గా స్ట్రాంగ్ గా ఉండగలడు. ధావన్ ఎక్స్ పీరియెన్స్ ను బట్టి చూస్తే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత మ్యాచ్ ను నడిపించగల వారిలో ముందున్నాడు.
వైట్ బాల్ ఫార్మాట్ ను చక్కగా అర్థం చేసుకుంటాడు. ఇప్పటివరకూ ధావన్ కెరీర్లో 142 వన్డేల్లో 5వేల 977పరుగులు, 65టీ20ల్లో వెయ్యి 673పరుగులు చేయగలిగాడు.
కేఎల్ రాహుల్: ఆస్ట్రేలియా వన్డేల్లో రోహిత్ లేనప్పుడు కోహ్లీకి డిప్యూటీగా ధావన్ ను ఎంచుకోలేదు. లెఫ్ట్ హ్యాండర్ కంటే కేఎల్ రాహుల్ కే ఛాయీస్ ఇచ్చారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ వహించిన వ్యక్తికే తాత్కాలిక వైస్ కెప్టెన్ బాధ్యతలు ఇచ్చారు. కెప్టెన్ గా నిరూపించుకోవడానికి రాహుల్ ఐపీఎల్ లో అసాధారణ ప్రతిభనే కనబరిచాడు.
భువనేశ్వర్ కుమార్: గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ దూరం అవడంతో భువనేశ్వర్ కుమార్ చాలా కరెక్ట్ ఛాయీస్. సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా కొన్ని మ్యాచ్ లు ఆడాడు. ఐపీఎల్ 2019లో కేన్ విలియమ్సన్ లేకపోయినా ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు.