IND-W vs SL-W : నేడే భారత్ వర్సెస్ శ్రీలంక మహిళల ఆసియాకప్ 2026 పైనల్.. ఎక్కడ చూడొచ్చంటే?
మహిళల ఆసియాకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు (IND-W vs SL-W ) తలపడనున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- September 13, 2026 / 12:37 PM IST
Womens Asia Cup 2026 Final match between India and Srilanka When And Where To Watch
IND-W vs SL-W : దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియాకప్ 2026 ఆఖరి అంకానికి చేరుకుంది. నేడు (సెప్టెంబర్ 13 ఆదివారం) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. అటు భారత్, ఇటు శ్రీలంక రెండు జట్లు కూడా ఈ మెగాటోర్నీలో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరుకోవడం విశేషం. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
రికార్డు స్థాయిలో ఇప్పటికే ఏడు సార్లు మహిళల ఆసియాకప్‌ను సొంతం చేసుకున్న భారత్ నేటి మ్యాచ్‌లోనూ విజయం సాధించి ఎనిమిదో సారి కప్పును ముద్దాడాలని భావిస్తోంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోన్న శ్రీలంక సైతం మరోసారి కప్పును కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది.
IND vs AFG : నేటి నుంచే అఫ్గాన్‌తో భారత్ టీ20 సిరీస్.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
ఫైనల్ మ్యాచ్ జరిగే దుబాయ్ పిచ్ సాధారణంగా స్పినర్లకు అనుకూలం అన్న సంగతి తెలిసిందే. ఇరు జట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఈ క్రమంలో స్పిన్‌ను సమర్థవంతంగా ఆడిన జట్టే విజేతగా నిలవనుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు షఫాలీ వర్మ, స్మృతి మంధాన మాత్రమే రాణించారు. వీరిద్దరితో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ప్రతీకా రావల్, రిచా ఘోష్‌లు ఫైనల్‌లో బ్యాట్ ఝుళిపించాల్సిన అవసరం ఉంది. స్పిన్నర్లు దీప్తి శర్మ (11 వికెట్లు), శ్రీచరణి (8 వికెట్లు), ప్రేమ రావత్ (6 వికెట్లు) సూపర్ ఫామ్‌లో ఉండగా పేసర్లు నందని, క్రాంతి కూడా చక్కగా రాణిస్తున్నారు. మరోసారి బౌలింగ్ దళం విజృంభిస్తే ఎనిమిదో సారి కప్పును ముద్దాడడం భారత్‌కు పెద్ద కష్టం కాదు.
హెడ్-టు-హెడ్..
భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 31 టీ20 మ్యాచ్‌ల్లో పోటీపడ్డాయి. ఇందులో భారత్ 25 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో లంక జట్టు గెలుపొందింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
ఎక్కడ చూడొచ్చడంటే?
మహిళల ఆసియాకప్ 2026 ప్రసార హక్కులను సోనీ నెట్‌వర్క్ కలిగి ఉంది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్‌లో వీక్షించవచ్చు. ఇక ఓటీటీ విషయానికి వస్తే సోనీ లివ్ యాప్, వైబ్‌సైట్‌లలో స్ట్రీమింగ్ కానుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.
