×
Ad

IND vs PAK : నేడు భార‌త్‌, పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా?

మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025లో భాగంగా ఆదివాంర భార‌త్, పాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Womens ODI World Cup 2025 today match between India and pakistan

IND vs PAK : మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025లో భాగంగా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య నేడు (ఆదివారం అక్టోబ‌ర్ 5న‌) మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు కొలంబో వేదిక కానుంది. ఇరు దేశాల మ‌ధ్య నెలకొన్న ఉద్రిక్తతత‌ నేప‌థ్యంలో ఈ మ్యాచ్ పై సర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇటీవ‌ల జ‌రిగిన ఆసియాక‌ప్ 2025లో భార‌త పురుషుల జ‌ట్టు మూడు మ్యాచ్‌ల్లోనూ పాక్‌ను మ‌ట్టిక‌రిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న వివాదాస్ప‌ద ఘ‌ట‌న నేప‌థ్యంలో అమ్మాయిల మ్యాచ్‌కు మంచి హైప్ వ‌చ్చింది.

క‌ర‌చాల‌నం లేదు..
ఆసియాక‌ప్ 2025లో భార‌త పురుషుల జ‌ట్టు పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌లో క‌ర‌చాల‌నం చేయ‌ని సంగ‌తి తెలిసిందే. ఇక అమ్మాయిలు కూడా వారిని ఫాలో కానున్నారు. టాస్ సంద‌ర్భంగా గానీ.. మ్యాచ్ పూరైన త‌రువాత కూడా హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ నాయ‌క‌త్వంలోని భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు పాక్ మ‌హిళా జ‌ట్టుతో క‌ర‌చాల‌నం చేయ‌ద‌ని స‌మాచారం.

హెడ్-టు-హెడ్ రికార్డు ఇదే..
భార‌త్‌, పాక్ మ‌హిళ‌ల క్రికెట్‌లో ఇరు జ‌ట్లు 11 వ‌న్డేల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. అన్ని మ్యాచ్‌ల్లోనూ భార‌త్ విజ‌యం సాధించింది. ఇక వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025 టోర్నీని భార‌త్ విజ‌యంతో ఆరంభించింది. శ్రీలంక పై గెలుపొందింది. మ‌రోవైపు పాక్ మాత్రం ఓటమితో ఆరంభించింది. బంగ్లాదేశ్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.

ఫామ్, బలాబలాల్లో భారత్‌దే స్పష్టమైన పైచేయి అనేది కాద‌న‌లేని విష‌యం. అయిన‌ప్ప‌టికి కూడా పాక్‌ను మరీ తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. కెప్టెన్‌ ఫాతిమా సనాతో పాటు డయానా బేగ్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్‌లతో కూడిన బౌలింగ్‌ విభాగం టీమ్ఇండియాను ఇబ్బందుల‌కు గురి చేయ‌వ‌చ్చు.

ఫ్రీగా ఎలా చూడొచ్చంటే..
మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025 టోర్నీకి స్టార్ స్పోర్ట్స్‌, జియో హాట్ స్టార్ అధికారిక బ్రాడ్ కాస్ట‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. టీవీలో అయితే.. స్టార్ స్పోర్ట్స్ ఛాన‌ల్స్‌లో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం కానుంది. ఓటీటీలో అయితే.. జియో హాట్ స్టార్‌లో మ్యాచ్‌లను ఫ్రీగా చూడొచ్చు. భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025కి భారత మహిళల జట్టు ఇదే..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్-కెప్టెన్), ప్రతిక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్తిక భాటియా, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్.