WPL 2024 : డ‌బ్ల్యూపీఎల్ 2024 షెడ్యూల్ విడుద‌ల‌.. పూర్తి లిస్ట్ ఇదే.. ఫైన‌ల్ మ్యాచ్ ఎప్పుడంటే..?

బీసీసీఐ డ‌బ్ల్యూపీఎల్ రెండో సీజ‌న్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది.

WPL 2024

WPL 2024 schedule: ఇటీవ‌ల కాలంలో మ‌హిళ‌ల క్రికెట్‌కు ఆద‌ర‌ణ పెరుగుతోంది. గ‌తేడాది నిర్వ‌హించిన‌ మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌) తొలి సీజ‌న్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. మొత్తం ఐదు జ‌ట్లు దిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, యూపీ వారియర్స్ క‌ప్పు కోసం పోటీ ప‌డ్డాయి. చివ‌రికి ఫైన‌ల్ మ్యాచులో ఢిల్లీని ఓడించిన ముంబై ఇండియ‌న్స్ తొలి సీజ‌న్ విజేత‌గా నిలిచింది. ఈ క్ర‌మంలో రెండో సీజ‌న్ ఎప్పుడెప్పుడు ఆరంభం అవుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) డ‌బ్ల్యూపీఎల్ రెండో సీజ‌న్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. ఫిబ్ర‌వ‌రి 23 నుంచి రెండో సీజ‌న్ ఆరంభం కానుంది. మొద‌టి మ్యాచులో డిఫెండింగ్ చాంపియ‌న్ ముంబైఇండియ‌న్స్‌తో ర‌న్న‌ర‌ప్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు బెంగ‌ళూరు న‌గ‌రం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. మొద‌టి ద‌శ‌లో ఫిబ్ర‌వ‌రి 23 నుంచి మార్చి 4 వ‌ర‌కు మ్యాచులు బెంగ‌ళూరులో, రెండో ద‌శ‌లో మార్చి 5 నుంచి మిగిలిన మ్యాచులు ఢిల్లీలో జ‌ర‌గ‌నున్నాయి.

Viral Video : కోహ్లీ అనుకుని కోహ్లీ డూప్‌తో ఫోటోలకు ఎగబడ్డ జనాలు

లీగ్ ద‌శ‌, ఎలిమినేట‌ర్‌, ఫైన‌ల్ మ్యాచుల‌తో క‌లిపి మొత్తం 22 మ్యాచులు రెండో సీజ‌న్‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఫైన‌ల్ మ్యాచ్ ఢిల్లీ వేదిక‌గా మార్చి 17 జ‌ర‌గ‌నుంది.

డబ్ల్యూపీల్ 2024 షెడ్యూల్ ఇదే..

మొద‌టి ద‌శ‌లో బెంగ‌ళూరులో జ‌రిగే మ్యాచులు ఇవే..
ముంబయి ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ – ఫిబ్రవరి 23
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్స్ – ఫిబ్రవరి 24
గుజరాత్ జెయింట్స్ vs ముంబయి ఇండియన్స్ – ఫిబ్రవరి 25
యూపీ వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ – ఫిబ్రవరి 26
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ – ఫిబ్రవరి 27
ముంబయి ఇండియన్స్ vs యూపీ వారియర్స్ – ఫిబ్రవరి 28
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ – ఫిబ్రవరి 29
యూపీ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ – మార్చి 1
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబయి ఇండియన్స్ – మార్చి 2
గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ – మార్చి 3
యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – మార్చి 4

రెండో ద‌శ‌లో ఢిల్లీలో జ‌రిగే మ్యాచులు ఇవే..
ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబయి ఇండియన్స్ – మార్చి 5
గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – మార్చి 6
యూపీ వారియర్స్ vs ముంబయి ఇండియన్స్ – మార్చి 7
ఢిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్స్ – మార్చి 8
ముంబయి ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ – మార్చి 9
ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- మార్చి 10
గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్స్ – మార్చి 11
ముంబయి ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – మార్చి 12
ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ – మార్చి 13
ఎలిమినేటర్ – మార్చి 15
ఫైనల్ – మార్చి 17

IND vs ENG : ఉప్ప‌ల్‌లో టీమ్ఇండియా గెల‌వాలంటే.. రోహిత్ శ‌ర్మ ఈ ప‌ని చేయాల్సిందే..

ట్రెండింగ్ వార్తలు